విశాఖ జిల్లా కొయ్యూరు మండలంలోని చెల్దిగడ్డ వద్ద మావోయిస్టులు అమర్చిన రెండు మందు పాతరలను పోలీసులు వెలికితీశారు.
కొయ్యూరులో మందు పాతర్లు లభ్యం
Dec 7 2015 12:12 PM | Updated on Oct 9 2018 2:47 PM
కొయ్యూరు: విశాఖ జిల్లా కొయ్యూరు మండలంలోని చెల్దిగడ్డ వద్ద మావోయిస్టులు అమర్చిన రెండు మందు పాతర్లలను పోలీసులు వెలికి తీశారు. కూంబింగ్‌లో భాగంగా సోమవారం బోదరాల అటవీ ప్రాంతంలో మందుపాతరలను గుర్తించారు. పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో పోలీసులే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేసి ఉంటారని భావిస్తున్నారు. కొయ్యూరు, మంప సీఐ, ఎస్సై లతో పాటు స్పెషల్ పోలీసులను మావోయిస్టులు టార్గెట్ గా చేసుకున్నట్టు సమాచారం.
Advertisement


