వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను నిరాహార దీక్షను పోలీసులు శనివారం భగ్నం చేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను నిరాహార దీక్షను పోలీసులు శనివారం భగ్నం చేశారు. ఉదయభాను ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో సమైక్యవాదులు పోలీసుల్ని అడ్డుకోవడంతో జగ్గయ్యపేటలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.
సమైక్యాంధ్రకు మద్దతుగా ఆయన జగ్గయ్యపేటలో దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఉదయభాను ఆరోగ్యం క్షీణించటంతో... ఆయనను దీక్ష విరమించాలని వైద్యులు సూచించారు. సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలు చేపట్టిన సమైక్య సత్యాగ్రహాలకు మద్దతు వెల్లువెత్తుతోంది. గాంధీజయంతి రోజున ప్రారంభమైన ఈ దీక్షలు శనివారం కూడా కొనసాగుతున్నాయి.