
మహారాష్ట్ర నంబర్ ప్లేటు ముంచంగిపుట్టులో ఏపీ నంబర్‌ప్లేటుతో పోలీసులు పట్టుకున్న కారు
నాలుగు వేర్వేరు నంబర్లతో తిరుగుతున్న ఓ కారు ను పోలీసులు మంగళవారం పట్టుకున్నారు.
పెదబయలు(అరకులోయ): ముంచంగిపుట్టలో నాలుగు వేర్వేరు నంబర్లతో తిరుగుతున్న ఓ కారును పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా ఈ కారును ఆపగా అందులో ప్రయాణిస్తున్న వారు పరారయ్యారని ఎస్‌ఐ అరుణ్‌కిరణ్ తెలిపారు. కారును తనిఖీ చేసి, స్టేషన్‌కు తరలించినట్టు తెలిపారు. ఏపీ, మహారాష్ట్రకు చెందిన నాలుగు నంబర్‌ప్లేట్లతో ఈ కారు తిరుగుతున్నట్టు ఆయన చెప్పారు. ఏపీ 31బి 9229, మహారాష్ట్ర 20బీసీ 2794తో పాటు మరో రెండు నంబర్ ప్లేట్లు ఈ కారులో ఉన్నట్టు ఎస్‌ఐ తెలిపారు. ఈ కారు గంజాయి స్మగ్లర్లదా? లేక ఇతర పనులకు ఉపయోగిస్తున్నారా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.