పరిటాల శ్రీరామ్ సహా 11మందిపై కేసు నమోదు | police case filed against paritala sriram | Sakshi
Sakshi News home page

పరిటాల శ్రీరామ్ సహా 11మందిపై కేసు నమోదు

May 2 2014 8:37 AM | Updated on Jun 1 2018 8:31 PM

అనంతపురంలో తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలపై పోలీసులు సీరియస్ అయ్యారు.

అనంతపురం : అనంతపురంలో తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలపై పోలీసులు సీరియస్ అయ్యారు. ఎలకుంట్ల గ్రామస్తులపై దాడి కేసులో రాప్తాడు టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ సహా 11మంది టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

గత నెల 30న కనగానపల్లి మండలంలోని ఎలకుంట్ల గ్రామంలో ప్రచారానికి వెళ్లిన పరిటాల శ్రీరామ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్న ఏడుగురిపై రాళ్ల వర్షం కురిపించి తీవ్రంగా గాయపరిచాడు. మళ్లీ గురువారం ఆయన రాప్తాడు మండలంలో కూడా దాదాపుగా 50 వాహనాలు, 200 ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా వెళ్లి గ్రామాల్లో నానాహంగామా సృష్టించాడు.


 

Advertisement
 
Advertisement
Advertisement