ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా కదిరిలో పోలీసులు అత్యుత్సాహం చూపించారు.
అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా కదిరిలో పోలీసులు అత్యుత్సాహం చూపించారు. బాబు పర్యటనను కవర్ చేసేందుకు వచ్చిన పత్రికా ఫోటోగ్రాఫర్లపై పోలీసులు శుక్రవారం దాడి చేశారు. దాంతో పోలీసుల చర్యను నిరసిస్తూ జర్నలిస్టులు నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ ...జర్నలిస్టులకు సర్థి చెప్పటంతో వివాదం సద్దుమణిగింది.