ప్రేమను అంగీకరించలేదని యువతి హత్య | Person Attacked Woman with Axe, Killed | Sakshi
Sakshi News home page

ప్రేమను అంగీకరించలేదని యువతి హత్య

Sep 14 2013 9:44 AM | Updated on Oct 8 2018 5:04 PM

మహబూబ్‌నగర్‌ జిల్లా తాడూర్‌ మండలం ఆకునెల్లికుదురు గ్రామంలో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో ఓ యువతి బలైపోయింది.

తాడూర్ : మహబూబ్‌నగర్‌ జిల్లా తాడూర్‌ మండలం ఆకునెల్లికుదురు గ్రామంలో దారుణం జరిగింది. నిర్భయ దారుణంపై నలుగురికి ఉరిశిక్ష పడిన రోజే యువతిపై అరాచకానికి తెగబడ్డాడో ఉన్మాది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  ప్రేమను అంగీకరించలేదన్న నెపంతో అనిత అనే యువతిని అదే గ్రామానికి చెందిన తిరుపతయ్య నరికి చంపాడు. తనను ప్రేమించాలంటూ తిరుపతయ్య ఆరు నెలలుగా అనిత వెంటపడుతున్నాడు.

నెల క్రితం అనితను కిడ్నాప్‌ కూడా చేశాడు. అప్పట్లో అది సంచలనం సృష్టించింది. దాంతో తల్లిదండ్రులు అనితను చదువు మానిపించారు. అప్పటి నుంచి ఆమె పొలం పనులకు వెళ్తోంది. శుక్రవారం పొలం పనులకు వెళ్లిన అనితను తిరుపతయ్య గొడ్డలితో నరికాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ప్రస్తుతం తిరుపతయ్య పరారీలో ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement