సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీఎన్జీవోలు హైదరాబాద్లో నిర్వహించదలచిన ధర్నాకు షరతులతో కూడిన అనుమతి లభించింది.
హైదరాబాద్: సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీఎన్జీవోలు హైదరాబాద్లో నిర్వహించదలచిన ధర్నాకు షరతులతో కూడిన అనుమతి లభించింది. బుధవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని ముగించాలని సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డి తెలిపారు.
పదివేలకు మించి ధర్నాకు రాకూడదని, ఎలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేయరాదని చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడకూడదని కమలాసన్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే ధర్నాను ఇందిరాపార్క్‌కు మాత్రమే పరిమితం చేయాలని సూచించారు.