మున్సిపల్ కార్మికుల ఖాతాల్లో పీఎఫ్, ఈఎస్‌ఐ సొమ్ము జమచేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నల్లగొండ టుటౌన్, న్యూస్‌లైన్: మున్సిపల్ కార్మికుల ఖాతాల్లో పీఎఫ్, ఈఎస్‌ఐ సొమ్ము జమచేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికులను పర్మనెంట్ చేసి, కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు చేపట్టిన సమ్మె మంగళవారం నాటికి రెండో రోజుకు చేరింది.
ఈ సందర్భంగా కార్మికులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో అవినీతి, అక్రమాలను అరికట్టాలని కోరారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, అందరికీ ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు, హెల్త్‌కార్డులు అందజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అవుట రవీందర్, అద్దంకి నర్సింహ, పెరిక భిక్షం, పేర్ల సంజీవ, దాసరి లక్ష్మ మ్మ, సుగుణమ్మ, భాగ్యమ్మ, ఎల్లమ్మ, నాగుల కరుణ, ఈశ్వరమ్మ, రమేష్, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.