బిల్లులు...చిల్లులు | Sakshi
Sakshi News home page

బిల్లులు...చిల్లులు

Published Sat, Feb 8 2014 3:01 AM

perforated bills ...

.... అదే గ్రామానికి చెందిన వడ్ల వెంకటప్పకు ఇందిరమ్మ ప థకం కింద అనుమతించారు. పునాది వరకు సొంత డబ్బులతో ఇంటి నిర్మాణం సాగించాడు. ఇందిరమ్మ బిల్లు మంజూ రు కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రభుత్వ పరంగా బిల్లు మంజూరు కాకపోవడంతో దిక్కుతోచని స్థితిలో నిర్మాణాన్ని నిలిపేయాల్సి వచ్చిందని వెంకటయ్య చెబుతున్నాడు.
 
 ... దౌల్తాబాద్‌కు చెందిన శంకరమ్మకు ఇందిరమ్మ తొలి విడత కింద ఇల్లు మంజూరైంది. బిల్లులు ఎప్పుడైనా మంజూరవుతాయన్న ఆశతో ఆమె స్లాబ్ వరకు ఏడాది కిందట ఇంటిని నిర్మించుకుంది. అందుకు సంబంధించి బేస్‌మెంట్ లెవల్ బిల్లు మాత్రమే ఇచ్చారని, గతంలో నాట్ స్టార్టెడ్ అంటూ ఏడాదిపాటు తిప్పుకున్నారని... మిగిలిన బిల్లు ఇవ్వాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకుండా పోతోందని, దీంతో మిగిలిన ఇంటి నిర్మాణం పూర్తిచేయలేక, ఇప్పటి వరకు చేపట్టిన నిర్మాణానికి అప్పులు తీర్చలేక ఇబ్బంది పడుతున్నానని శంకరమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. ఇలా.. జిల్లాలో పలువురు ఇంది రమ్మ లబ్దిదారులు సకాలంలో నిధులు మంజూరు కానందున ఇంటిని నిర్మించుకోలేక ఇబ్బంది పడాల్సి వస్తోంది...
 
 న్యూస్‌లైన్, పాలమూరు: ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం 40,217 ఇండ్లను పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించగా ఇప్పటి వరకు కేవలం 19,357 ఇళ్లకు మాత్రమే బిల్లులు మంజూరయ్యాయి. ఇందులోనూ కొందరు లబ్దిదారులకు అరకొరగా  అందినట్లు తెలుస్తోంది. నిర్దేశించిన లక్ష్యం 50 శాతం కూడా చేరుకోకపోవడంతో సొంతింటి నిర్మించుకోవాలని భావించిన నిరుపేదలు అయోమయానికి గురవుతున్నారు. కొన్నిచోట్ల అధికారులు బిల్లుల పంపిణీలో చేతివాటం ప్రదర్శించారు. సిమెంటు, బిల్లుల పంపిణీ ఆలస్యం అవుతుండటంతో లబ్దిదారులు నిర్మాణాలను పూర్తి చేసుకోలేక అవస్థ పడుతున్నారు.
 
 లక్ష్యమూ..గగనమే...
 ఇందిరమ్మ మొదటి, రెండు, మూడు విడతలతోపాటు రచ్చబండ 1, రచ్చబండ 2 కింద 5.52 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో 2.13లక్షల ఇళ్లు పూర్తయ్యాయి.2.59లక్షల ఇళ్ల నిర్మాణం ఇప్పటికీ ప్రారంభం కాలేదు. 40వేల ఇళ్లు గోడల స్థాయిలో 25వేల ఇళ్లు గోడలకన్నా తక్కువ స్థాయిలో ఉండగా.. 35వేల ఇళ్లు పునాది కన్నా తక్కువ స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది.
 
 ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో 50 రోజులు గడువు ఉండటంతో అందరు లబ్దిదారులకు నిధులు మంజూరయ్యే పరిస్థితులు కనబడటంలేదు. ఈ ఏడాది 40,217 ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించగా.. ఇప్పటి వరకు 19,357  మాత్రమే పూర్తి చేశారు.  చివరికి లబ్దిదారుడు ఎంతో కొంత మామూళుల ముట్టచెపితే బిల్లు మంజూరుకు ఎంబుక్ రికార్డు చేసి పంపుతున్నారు. అలా ఇచ్చుకోలేనివారికి  ఇక ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులకు వచ్చే అదనపు మొత్తంలో అధికారులు అందినంత గుంజుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు.
 
 వేధిస్తున్న సమస్యలు
 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సిమెంటు కొరత అధికంగా ఉంది. ధర పెంచే వరకు  సరఫరా చేసేది లేదని కంపెనీలు తెగేసి చెప్పాయి. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో నవంబర్‌లో సరఫరాను తగ్గించాయి.
 
  సిమెంటు కొరత వల్ల కూడా ఒక్క ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు పూర్తి కావడం లేదు.
  స్థలం లేని లబ్దిదారులకు కేటగిరి-3 కింద గుర్తించి ప్రభుత్వం ఊరి బయట ప్రభుత్వ స్థలాన్ని సేకరించి ఇళ్లు నిర్మించాల్సి ఉంటుంది.
 
 అయితే జిల్లాలో స్థల సేకరణ పూర్తి చేయడం లేదు. లబ్దిదారులను ఊరిస్తూ.. ఇళ్ల స్థలాల పంపిణీ అప్పుడు, ఇప్పుడూ అంటూ కాలయాపన చేస్తుండటం ఇబ్బందిగా మారింది.
 

Advertisement
 
Advertisement
 
Advertisement