‘వైఎస్‌ జగన్‌కు ప్రజలే రక్షణ కల్పిస్తారు’ | People Protects YS jagan Mohan Reddy Says Mithun Reddy | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌కు ప్రజలే రక్షణ కల్పిస్తారు : మిథున్‌ రెడ్డి

Nov 18 2018 6:42 PM | Updated on Nov 18 2018 6:44 PM

People Protects YS jagan Mohan Reddy Says Mithun Reddy - Sakshi

సాక్షి, అనంతపురం : ఏపీలో సీబీఐ అనుమతి లేదంటూ సీఎం చంద్రబాబు నాయుడు జీవో జారీ చేయడం దుర్మార్గమని వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ మిథున్‌ రెడ్డి మండిపడ్డారు. సీబీఐ విచారణ అంటే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఆదివారం ఆయన అనంతపురంలో మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్నాయత్నం వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఆయన ఆరోపించారు. అందుకే విచారణకు బయపడి సీబీఐ అనుమతి లేకుండా జీవో ఇచ్చారని అన్నారు. హత్యాయత్నం వెనుక ఉన్న వాస్తవాలు బయటపతాయనే థర్డ్‌ పార్టీ విచారణకు చంద్రబాబు వెనకడుగు వేస్తున్నారని విమర్శించారు. ప్రజల కోసం పోరాడతున్న ప్రతిపక్ష నేతకు ప్రజలే రక్షణ కల్పిస్తారని మిథున్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement