ఆకలి కడుపులు నింపుతున్న సామాన్యలు

People Helping Poor During Lockdown - Sakshi

కరోనా కష్టకాలంలో పేదలు చాలా మంది జీవనోపాధి కోల్పొయి ఆకలితో అలమటిస్తున్నారు. ఒక్కపూట ఆహారం కూడా దొరకక కుటుంబంతో కలసి పస్తులు ఉంటున్నారు. రోజు పనికి వెళితే కానీ పూట గడవని బడుగు జీవులు బాధతో వస్తున్న కన్నీటిని దిగమింగుతూ భోజనం పెట్టి ఆదుకునే వారి కోసం ఆశగా ఎదురు చూస్తు​న్నారు. వారిని ఆదుకునేందుకు అనేక స్వచ్ఛంధ సంస్థలతో పాటు సామాన్యులు సైతం చేతనైనంత సాయం అందిస్తున్నారు. (వాళ్లు కూడా మనవాళ్లే)

కృష్ణాజిల్లా ఉయ్యూరులో ఆర్‌ఎంపీగా పనిచేస్తున్న నగిపోగు కోటేశ్వర రావు కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో ఉపాధి కోల్పొయిన వారికి ఆహారాన్ని అందిస్తూ ఆకలి తీరుస్తున్నారు. నిరుపేదలు, నిరాశ్రయులతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి లాక్‌డౌన్‌ కారణంగా చిక్కుకుపోయిన లారీ డ్రైవర్లకు కూడా భోజనాన్ని అందిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. 

గుంటూరు జిల్లా చిలకలూరి పేటలో ఆర్‌ఆర్‌ హెచ్ఈ డీఎస్‌ సంస్థ ఎయిడ్స్‌ వ్యాధి గ్రస్తులకు, దివ్యాంగులకు, నిరుపేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసి వారిని ఆదుకుంటున్నారు. ఇప్పటి వరకు అనేక మందికి సాయాన్ని అందించిన ఈ సంస్థ మానవత్వాన్ని చాటుతూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. 

తూర్పుగోదావరి జిల్లా తొందంగికి చెందిన క్రిష్టియన్‌ వర్‌షిప్‌ సెంటర్‌ చర్ఛ్‌ లాక్‌డౌన్‌ కారణంగా రోడ్డుపై ఉంటూ ఆహారం దొరకక ఇబ్బంది పడుతున్న భిక్షగాళ్లకు, అనాధలకు ఆహారాన్ని అందించారు. దాదాపు 200 మందికి పైగా భోజనాన్ని పంపిణీ చేశారు. (కరోనాపై పోరాటంలో మీరు చేయి కలపండి)

మేడ్చల్‌ గ్రంధాలయ డైరెక్టర్‌ అనిత శ్రీపద రావు కుకట్‌ పల్లి కరోనా కారణంగా ఉపాధి కోల్పొయి బాధపడుతున్న నిరుపేదలకు నిత్యవసర సరుకులు అందించారు. గత 15 సంవత్సరాలుగా ఎంతో మంది పేదలను ఆదుకుంటూ అండగా నిలుస్తున్న అనిత కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఆమె సాయాన్ని మరింత విస్తరించి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. 

మీరు కూడా లా​క్‌డౌన్‌ కాలంలో చేస్తున్న సేవ కార్యక్రమలను webeditor@sakshi.com ద్వారా తెలియజేస్తూ మరికొంత మందిలోసాయం చేయాలన్న స్ఫూర్తిని నింపండి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top