వృద్ధాప్య పింఛన్ పెంపునకు కృషి | pension raising efforts Centre Social Justice, | Sakshi
Sakshi News home page

వృద్ధాప్య పింఛన్ పెంపునకు కృషి

Sep 9 2013 2:41 AM | Updated on Sep 1 2017 10:33 PM

మన రాష్ట్రంలో వృద్ధాప్య పింఛన్‌ను 1300 రూపాయలకు పెంచేందుకు కృషి చేస్తున్నట్టు కేంద్ర సామాజిక న్యాయం,

కొత్తగూడెం, న్యూస్‌లైన్:మన రాష్ట్రంలో వృద్ధాప్య పింఛన్‌ను 1300 రూపాయలకు పెంచేందుకు కృషి చేస్తున్నట్టు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారికత శాఖ సహాయ మంత్రి పోరిక బలరాం నాయక్ చెప్పా రు. రాజస్థాన్ రాష్ట్రంలో ఇప్పటికే వృద్ధాప్య పిం ఛన్ రూ.1300 ఇస్తున్నారని చెప్పారు. ఇదే మొత్తాన్ని మన రాష్ట్రంలో కూడా రానున్న రోజు ల్లో ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. కొత్తగూడెంలో సింగరేణి ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ సెంట్రల్ కార్యాలయాన్ని మంత్రి ఆదివా రం ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో బలరామ్ నాయక్ మాట్లాడుతూ.. ఉత్పత్తితోపాటు గిరిజనుల సంక్షేమంపై కూడా దృష్టి సారించాలని సింగరేణి సంస్థ అధికారులకు సూ చించారు.
 
 కొత్తగూడెంలో సింగరేణి వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రికి వినతిపత్రం ఇచ్చినట్టు తెలిపారు. ఇప్పటికే 300 పడకలతో సింగరేణి ప్రధాన ఆసుపత్రి ఉన్నందున.. వైద్య కళాశాల ఏర్పాటుకు మార్గం తేలికవుతుందని అన్నారు. సింగరేణి కార్మికులకు ఉద్యోగ విరమణ తరువాత కనీసంగా 25లక్షల రూపాయలు అందేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూ చించారు. సింగరేణిలో నాల్గవ తరగతి ఉద్యోగాలకు గిరిజనులను తీసుకునేలా చర్యలు తీసుకోవాలని, దీనిని ఖమ్మం జిల్లా నుంచే ప్రారంభిం చాలని, గిరిజన విద్యపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి సత్వర చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరా రు. ఇల్లెందులో కొత్త మైనింగ్ గనులను త్వరలో ప్రారంభించనున్నట్టు చెప్పారు.
 
 మణుగూరు ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ... గిరిజన ప్రాంతంలోనే సింగరేణి సంస్థ ఎక్కువగా విస్తరించినందున ఇక్కడి అభివృద్ధికి (సింగరేణి) యాజమాన్యం దృష్టి సారించాలని కోరారు. కేంద్ర మంత్రిని ఎస్టీ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సింగరేణి డెరైక్టర్లు బి.రమేష్‌కుమార్, మనోహర్‌రావు, విశ్వనాధరాజు, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ బి. నాగ్యా, సీఎంఓఐఏ అధ్యక్షుడు మాదాసి మల్లేష్, ఎస్టీ లైజన్ ఆఫీసర్ పి.బాలరాజు, ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రమేష్, మాధవ్ నాయక్  పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement