వ్యక్తిగత విషయాలు మాట్లాడనున్న పవన్? | Pawan Kalyan to Clarify on third Marriage | Sakshi
Sakshi News home page

వ్యక్తిగత విషయాలు మాట్లాడనున్న పవన్?

Mar 13 2014 10:47 AM | Updated on Mar 22 2019 5:33 PM

వ్యక్తిగత విషయాలు మాట్లాడనున్న పవన్? - Sakshi

వ్యక్తిగత విషయాలు మాట్లాడనున్న పవన్?

పవన్ కళ్యాణ్ తన మూడో పెళ్లిపై ఆయన వివరణ ఇవ్వనున్నారని సమాచారం.

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశంపై జోరుగా చర్చలు  జరుగుతున్నాయి. రేపు 14న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఏర్పాటుచేసే సభలో పవన్ కళ్యాణ్ తన  పెట్టబోయే పార్టీ, అజెండా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ సంగతి పక్కన పెడితే తన వ్యక్తిగత విషయాలు ఈ సమావేశంలో పవన్ ప్రస్తావించే అవకాశముందని తెలుస్తోంది.

తన మూడో పెళ్లిపై ఆయన వివరణ ఇవ్వనున్నారని సమాచారం. తాను మూడో పెళ్లి చేసుకోవడానికి దారి తీసిన పరిస్థితులను వెల్లడించనున్నారని తెలుస్తోంది. ఇప్పటివరకు దీని గురించి పవన్ కళ్యాణ్ పెదవి విప్పలేదు. రష్యన్ సంతతికి చెందిన ఆస్ట్రేలియా నటి, మోడల్ అయిన అన్నా లెజ్‌నేవాను ఆయన గత సెప్టెంబర్ 30న హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement