‘బాల్యాన్ని చిదిమేయద్దు’ | parents don't do the child marriages | Sakshi
Sakshi News home page

‘బాల్యాన్ని చిదిమేయద్దు’

Mar 30 2017 9:05 PM | Updated on Jun 1 2018 8:59 PM

‘బాల్యాన్ని చిదిమేయద్దు’ - Sakshi

‘బాల్యాన్ని చిదిమేయద్దు’

అభం.. శుభం తెలియని చిన్నారులకు వివాహాలు చేసి వారి జీవితాలను చిదిమేయడం మంచిది కాదని తల్లిదండ్రులకు సూచించారు.

బీటీపీ-గుమ్మఘట్ట : అభం.. శుభం తెలియని చిన్నారులకు వివాహాలు చేసి వారి జీవితాలను చిదిమేయడం మంచిది కాదని కేజీబీవీ ఎస్‌ఓ శారద విద్యార్థినుల తల్లిదండ్రులకు సూచించారు. గుమ్మఘట్ట మండలం బీటీప్రాజెక్ట్‌ వద్ద ఉన్న కేజీబీవీ పాఠశాలలో స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎం రమాదేవి అధ్యక్షతన గురువారం  విద్యార్థులు వారి తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఓ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 62 కేజీబీవీల్లో ఏటా 12,400ల మంది విద్యార్థినులు చదువుకుంటారని, వీరిలో సగటున 2,305 మంది విద్యార్థినీలు పది పరీక్షలు పూర్తవగానే ఇళ్లకు వెళతారన్నారు.

ఇళ్లలో పెద్దలు చదువు చాలని 18 లోపే పెళ్లిలు చేస్తూ బంగారం లాంటి జీవితాలను నాశనం చేయడం మంచి పద్ధతి కాదని అవగాహన కల్పించారు. ప్రస్తుత ఏడాది కూడా 2305 మంది కేజీబీవీ విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని, తమ పాఠశాల నుంచి 40 మంది పరీక్షల్లో పాల్గొన్నట్లు వివరించారు. వీరికి బాల్య వివాహాలపై అవగాహన కల్పించేందుకే సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. హెచ్‌ఎం మాట్లాడుతూ చదువుకున్న ప్రతి అమ్మాయి బాల్య వివాహాలపై తిరుగుబాటు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్‌వీఎం అధికారులు బాలమురళి తో పాటు ఉపాద్యాయ బృందం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement