ఎదురుచూపులు..!

Pakistan Coast Guards Arrest Vizianagaram Fishermens - Sakshi

పాక్‌ భద్రతా దళాలకు చిక్కిన తిప్పలవలస, ముక్కాం మత్స్యకారులు

ఎప్పుడు వస్తారా అంటూ ఆశగా ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు

విజయనగరం, పూసపాటిరేగ: బతుకుదెరువు కోసం చేపల వేట  చేస్తూ సముద్రంపై వందల కిలోమీటర్ల దూరం వెళ్లి పాక్‌ భద్రతా దళాలకు చిక్కిన తమవారు ఎప్పుడు వస్తారా అని పూసపాటిరేగ మండలం తిప్పలవలస, భోగాపురం మండలం ముక్కాం గ్రామస్తులు ఆశగా ఎదురుచూస్తున్నారు. తమవారి యోగక్షేమాలు ఎప్పుడు తెలుస్తాయోనని క్షణమొక యుగంగా గడుపుతున్నారు.  తిప్పలవలస గ్రామానికి చెందిన నక్క పోలమ్మ భర్త నక్క అప్పన్న, కుమారుడు నక్క ధనరాజు పాక్‌ భద్రతా దళాలకు దొరికిపోయారు.

అప్పటి నుంచి పోల మ్మ లబోదోబోమంటోంది. కనీసం భర్త, కుమారుడి యోగక్షేమాలు కూడా తెలియడం లేదని కన్నీటిపర్యంతమైంది. కేంద్ర అధికారులు స్పం దించి తమ వారితో కనీసం మాట్లాడించాలని వేడుకుంటోంది.  అలాగే తన కుమారుడు నక్క నర్శింగ్‌ ఎలాగైనా వచ్చేస్తాడని అతని తల్లి నక్క నరసయ్యమ్మ కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తోంది. కుమార్తె పెళ్లి అప్పులు తీర్చడానికి వేటకు వెళ్లి తన భర్త పాక్‌ బలగాలకు దొరికిపోయాడని బర్రి బవిరీడు భార్య పోలమ్మ చెబు తోంది. అలాగే మైలపల్లి గురువులు భార్య దానయ్యమ్మ కూడా తన భర్త రాక కోసం ఎదురుచూస్తోంది. బందీలుగా ఉన్న మత్స్యకారులను విడిపించడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top