
శిరివెళ్ల: నల్లమల అటవీ ప్రాంతంలో గిరిజనులు నివసించే పచ్చర్ల గూడెం నేడు అందాలకు నెలవుగా మారింది. నంద్యాల– ఒంగోలు రహదారిలో పచ్చర్ల వద్ద ఉన్న ఎకో టూరిజం పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఎటు చూసినా పచ్చదనమే. వేసవిలో ఆహ్లాదంతోపాటు చల్లదనాన్నిస్తోంది. ప్రభుత్వం రూ.1.25 కోట్లతో ఎకో టూరిజంను నెలకొల్పింది. అందులో భాగంగా 4 ఏసీ కాటేజీలు, రెండు ఆర్మీ బేస్ క్యాంప్ తరçహాలో కాటేజీలను నిర్మించారు. వివిధ రకాల పూల మొక్కల మధ్య కాటేజీలు ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి.
24 గంటలు ఏసీ సదుపాయం..
కాటేజీల్లో విడిది చేసే వారికి 24 గంటల విద్యుత్, ఏసీ సదుపాయాలున్నాయి. దీని కోసం సోలార్, జనరేటర్ ఏర్పాటు చేశారు. 24 గంటలకు కుటుంబానికి రూ.4వేలు అద్దె చెల్లించి విడిది చేయవచ్చు. భోజనం, జంగిల్ సఫారీ çసదుపాయం ఉంది. జంగిల్ సఫారీ ద్వారా అడవిలో ఉన్న జంతువులను ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పించారు. ఎకో టూరిజంలో పిల్లలు ఆడుకోవడానికి పలు సదుపాయాలున్నాయి. దీని ద్వారా ఏటా రూ.40 లక్షల ఆదాయం వస్తోంది. ఎకో టూరిజం చూడడానికి ఆన్‌లైన్ బుకింగ్ సౌకర్యం ఉంది. మరిన్ని వివరాలకు www.nalamalaijunglecamps.com, సెల్ నంబర్లు 94408 10074,70930 08648లో సంప్రదించవచ్చు.