ఆర్టీసీని కేశినేనికి అప్పజెప్పే కుట్ర


ఆర్టీసీని కే శినేని ట్రావెల్స్‌కు అప్పజెప్పేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రపన్నుతున్నాడని కమలాపురం ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పి.రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. ఈ రోజు బిహార్ ప్రజలు మోదీకి బుద్ధి చెప్పినట్లే త్వరలో ఆంధ్రాలో కూడా ప్రజలు టీడీపీకి బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు. మదనపల్లిలో జరిగిన వైఎస్సార్‌సీపీ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఆర్టీసీ కార్మికుల సమస్యలు తీర్చాలని మదనపల్లి డిపోమేనేజర్ ప్రభాకర్‌కు వినతి పత్రం సమర్పించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top