ఆప్షన్ గల్లంతు.. | options are missed in scholar ship form | Sakshi
Sakshi News home page

ఆప్షన్ గల్లంతు..

Feb 4 2014 3:48 AM | Updated on Mar 28 2018 10:59 AM

వెనకబడిన తరగతులకు చెందిన విద్యార్థులు చిక్కుల్లో పడ్డారు. ప్రభుత్వం బీసీ విద్యార్థులకు ఇస్తున్న ప్రీ మెట్రిక్(పదోతరగతికి ముందు) విద్యార్థుల ఉపకార వేతనాలకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియను ఒక్కసారిగా నిలిపివేయడంతో ఆందోళన చెందుతున్నారు.


 ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ దరఖాస్తుల నిలిపివేత
 ‘ఈపాస్’ వెబ్‌సైట్ నుంచి ‘బీసీ’ ఆప్షన్ తొలగింపు
 చిక్కుల్లో బీసీ విద్యార్థులు..
 
 సాక్షి, రంగారెడ్డి జిల్లా: వెనకబడిన తరగతులకు చెందిన విద్యార్థులు చిక్కుల్లో పడ్డారు. ప్రభుత్వం బీసీ విద్యార్థులకు ఇస్తున్న ప్రీ మెట్రిక్(పదోతరగతికి ముందు) విద్యార్థుల ఉపకార వేతనాలకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియను ఒక్కసారిగా నిలిపివేయడంతో ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి బీసీ విద్యార్థుల ప్రీమెట్రిక్ ఉపకార వేతనాలకు సంబంధించి విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ప్రభుత్వం ప్రకటించింది. అయితే క్షేత్రస్థాయిలో అంతగా ప్రచారం లేకపోవడంతో దరఖాస్తుల ప్రక్రియ నత్తనడకన సాగింది. మరోవైపు ఆదాయ ధ్రువీకరణ మరింత పరిమితంగా విధించడం.. సర్టిఫికెట్ల జారీలో తీవ్ర  జాప్యం కావడంతో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. తాజాగా అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలతో సిద్దంగా ఉన్నప్పటికీ.. అర్థంతరంగా దరఖాస్తు ప్రక్రియను నిలిపివేయడంతో విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది.
 
 ప్రచారలోపం: ప్రీ మెట్రిక్ ఉపకారవేతనాలకు సంబంధించి ప్రభుత్వం బీసీ విద్యార్థులకు అవకాశం కల్పించింది. 5నుంచి పదోతరగతి చదివే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులోతో పాటు 9,10 తరగతులు చదివే బీసీ విద్యార్థులు ఈ ఉపకారవేతనాలకు అర్హులు. ఎస్సీ, ఎస్టీల వార్షికాదాయం రూ.2 లక్షలు కాగా, బీసీ విద్యార్థులకు మాత్రం రూ. 45 వేలుగా నిర్ణయించింది. అయితే క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు కనిష్టంగా రూ.50 వేలకు తక్కువ ఆదాయాన్ని ధ్రువీకరించడం లేదు. దీంతో బీసీ విద్యార్థులు అనర్హులవుతున్నారు. ఈనేపథ్యంలో అధికారులను ఒప్పించి ఆదాయ సర్టిఫికెట్లు తెచ్చుకోగా.. దరఖాస్తు నమోదును నిలిపివేయడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. జిల్లాలో 9,10 తరగతులు చదివే బీసీ విద్యార్థులు 35వేల వరకు ఉంటారని అంచనా. అయితే ఇప్పటివరకు కేవలం 4వేల వరకు మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఆధార్ కార్డులను కూడా తప్పనిసరి చేసింది. దీంతో కార్డులు లేని విద్యార్థులంతా దరఖాస్తుకు నోచుకోలేకపోయారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement