గ్రామంలో అతిసార : ఒకరు మృతి | one dies due to diarrhea | Sakshi
Sakshi News home page

గ్రామంలో అతిసార : ఒకరు మృతి

Jun 16 2015 4:31 PM | Updated on Sep 3 2017 3:50 AM

చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం పెద్దూరు గ్రామంలో అతిసార ప్రబలి ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

శాంతిపురం (చిత్తూరు) : చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం పెద్దూరు గ్రామంలో అతిసార ప్రబలి ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. పెద్దూరు గ్రామంలోని మంచినీటి పథకం ద్వారా సరఫరా అయ్యే నీరు సోమవారం కలుషితం కావటంతో స్థానికులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి 15 మంది వివిధ ఆస్పత్రుల్లో చేరారు.  కాగా కనకమ్మ(80) అనే మహిళ పరిస్థితి విషమించి మంగళవారం మధ్యాహ్నం చనిపోగా మునెప్ప(55) ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement