ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
కళ్యాణదుర్గం (అనంతపురం) : ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం హెల్లికల్లు వద్ద సోమవారం చోటుచేసుకుంది. రాయదుర్గంకు చెందిన ఉదయ్ కుమార్ స్నేహితులతో కలిసి టాటా ఏస్‌లో అనంతపురం వెళ్తున్న సమయంలో హెల్లికల్లు వద్ద ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సు ఢీకొట్టింది.
దీంతో టాటాఏస్‌లో ఉన్న ఉదయ్‌కుమార్(35) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.