మనస్తాపంతో వృద్ధుడు ఆత్మహత్య | Olderman commits suicide | Sakshi
Sakshi News home page

మనస్తాపంతో వృద్ధుడు ఆత్మహత్య

Sep 24 2015 6:42 PM | Updated on Nov 6 2018 7:56 PM

కన్నకొడుకులే తనను సాకడానికి వంతులు వేసుకొని పోట్లాడుకోవడంతో మనస్తాపం చెంది ఓ తండ్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

రాచెర్ల (ప్రకాశం జిల్లా) : కన్నకొడుకులే తనను సాకడానికి వంతులు వేసుకొని పోట్లాడుకోవడంతో మనస్తాపం చెంది ఓ తండ్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయవిదారక సంఘటన ప్రకాశం జిల్లా రాచర్ల మండలం రామాపురం గ్రామంలో గురువారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన మదిరె పెద్దిరెడ్డి(79)కి ఇద్దరు కొడుకులు ఉన్నారు.

వారిలో ఒకరు ఆర్మీలో పనిచేస్తుండగా.. మరో కొడుకు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని ఎవరు సాకాలనే విషయంపై ఇద్దరు కొడుకుల మధ్య వాగ్వాదం జరిగింది. దీనికి తోడు ఎవరు తండ్రిని సాకితే తండ్రి దగ్గర ఉన్న రూ. లక్ష వారికే చెందాలి అంటూ మాట్లాడుకోవడంతో.. తీవ్ర మనస్తాపానికి గురైన పెద్దిరెడ్డి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Advertisement
 
Advertisement
Advertisement