వృద్ధురాలి హత్య | old lady murder | Sakshi
Sakshi News home page

వృద్ధురాలి హత్య

Dec 1 2014 1:46 AM | Updated on Aug 25 2018 4:51 PM

వృద్ధురాలి హత్య - Sakshi

వృద్ధురాలి హత్య

గుర్తుతెలియని దుండగులు ఓ వృద్ధురాలిని దారుణంగా హత్యచేసి ఆమె ఒంటిపై ఉన్న ఐదు కాసుల

ఐదు కాసుల బంగారం చోరీ
గుణదలలో ఘాతుకం

 
విజయవాడ సిటీ/గుణదల : గుర్తుతెలియని దుండగులు ఓ వృద్ధురాలిని దారుణంగా హత్యచేసి ఆమె ఒంటిపై ఉన్న ఐదు కాసుల బంగారు నగలు దోచుకుని పారిపోయారు. ఈ ఘాతుకం ఆదివారం గుణదల జియోన్ పాఠశాల సమీపంలో జరిగింది. పోలీసులు,

స్థానికుల కథనం ప్రకారం...  

వల్లభనేని మాధురిదేవి(65) జియోన్ పాఠశాల సమీపంలో తన సొంత ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. ఆ ఇంటి మేడ పై పోర్షన్‌లో అమె కుమారుడు సుజన్ కుటుంబంతో సహా కలిసి ఉంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో కార్పెంటర్‌గా పనిచేసే షేక్ షఫీ అలియాస్ బాజీ, మాధురీదేవి ఇంటికి వచ్చాడు. అమె వివరాలు అడగడంతో మీ కోడలు కబురు పెట్టగా వచ్చానని బదులిచ్చాడు. దీంతో ఆమె ఇంటర్ కం ఫోన్‌లో పై పోర్షన్‌లో ఉంటున్న కోడలు సరితకు కార్పెంటర్ వచ్చాడని చెప్పగా.. తాను పిలవలేదని సమాధానం ఇచ్చింది. దీంతో అమె పోన్ పెట్టేసింది. నాలుగు గంటల సమయంలో పిల్లలను స్విమ్మింగ్‌కు తీసుకువెళ్లిన కోడలు, 5.30 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చింది. అయితే తన అత్త కనిపించకపోవడంతో లోపలికి వెళ్లి చూడగా, హాల్‌లో అమె కిందపడి ఉండి ఉంది. ఒంటిపై నగలు కూడా లేవు. బాత్ రూమ్‌లో తడిపిన తలదిండు కనిపించింది. దీంతో కుటుంబం సభ్యుల సాయంతో అమెను హుటాహుటిన ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మాధురిదేవి ముక్కు నుంచి రక్తం కారడం, శరీరంపై ఉన్న గాయాలను బట్టి ఎదో జరిగి ఉంటుందని వైద్యులు అనుమానం వ్యక్తంచేశారు. రాత్రి  9.15 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే డీసీపీ(శాంతిభద్రతలు) తఫ్సీర్ ఇక్బాల్, సెంట్రల్  ఏసీపీ కె.లావణ్యలక్ష్మి, సీసీఎన్ ఏసీపీ గుణ్ణం రామకృష్ణ, టాస్క్‌ఫోర్స్ సీఐ కె.ఉమామహేశ్వరరావు, మాచవరం సీసీఎస్ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం ఘటనాస్థలంలో పలు ఆధారాలను సేకరించింది. పోలీసు జాగిలాన్ని రప్పించగా ఘటనా స్థలం నుంచి కొద్ది దూరం వెళ్లి ఆగిపోయింది.
 
పోలీసుల అదుపులో అనుమానితుడు!


మధ్యాహ్నం మాధురీదేవి ఇంటికి వచ్చిన కార్పెంటర్ బాజీని తోటవల్లూరులోని కనకదుర్గనగర్‌లో అదుపులోకి తీసుకన్నట్లు సమాచారం. ఈ మేరకు  అనుమానితుడిని నగరానికి తీసుకువచ్చి విచారిస్తున్నట్లు తెలుస్తుంది.
 
నగల కోసమే హత్య : డీసీపీ


 ప్రాథమిక ఆదారాలను బట్టి మాధురీదేవి నగల కోసమే ఆమెను హత్య చేసినట్లుగా భావిస్తున్నామని డీసీపీ విలేకరులకు తెలిపార

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement