బడి బాగుపడుతోంది..

Officials Speedup Nadu Nedu in Government Schools Srikakulam  - Sakshi

నాడు–నేడు పథకం ద్వారా జిల్లాలో 1239 పాఠశాలలు అభివృద్ధి

రూ.282.65 కోట్లతో చేపట్టనున్న పనులు

ఇప్పటికే రూ.36.37 కోట్లు పేరెంట్‌ కమిటీల ఖాతాలకు జమ

శ్రీకాకుళం: జిల్లాలో 1239 పాఠశాలలు నాడు–నేడు పథకం ద్వారా అభివృద్ధి చెందనున్నాయి. తొలి విడతలో ఎంపిక చేసిన ఈ 1239 పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి సౌకర్యం, విద్యుత్‌ సౌకర్యం, భవనాల పూర్తి మరమ్మతులను చేపడతారు. వీ టి కోసం రూ.282.65 కోట్లతో అంచనాలు రూపొందించారు. అయితే 31 పాఠశాలలు నాబార్డు నిధులతోను, 2 పాఠశాలలు ఏకలవ్య పథకం ద్వారా మంజూరైన నిధుల తో అభివృద్ధి చేస్తారు. పాతపట్నం, మెళియాపుట్టి, సారవకోటల్లోని 104 పాఠశాలల ను కార్పొరేట్‌ పరిశ్రమల యాజమాన్యాలు సమకూర్చే నిధులతో అభివృద్ధి చేస్తారు. ఈ పనులను ఆదిలీలా ఫౌండేషన్‌ అనే సంస్థకు అప్పగించారు. మిగిలిన 1087 పాఠశాలలను ఐదు ప్రభుత్వ శాఖల్లోని ఇంజినీరింగ్‌విభాగాలు అభివృద్ధి చేయనున్నాయి.

వీటిలో సమగ్ర శిక్షా అభియాన్, ఆంధ్రప్రదేశ్‌ ఎడ్యుకేషన్‌ వెల్ఫేర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, పంచాయతీ రాజ్, ట్రైబల్‌ వెల్ఫేర్, మున్సిపాలిటీల్లోని పబ్లిక్‌ హెల్త్‌ విభాగాల పర్యవేక్షణలో పనులు జరగనున్నాయి. పేరెంట్‌ కమిటీల ద్వారా ఈ పనులను చేయిస్తారు. ప్రభుత్వం ఇసుక సిమెంట్‌లను తక్కువ ధరలకు సరఫరా చేయనుంది. మిగిలిన సామగ్రి కొనుగోలు చేసేందుకు పేరెంట్‌ కమిటీల ఖాతాలకు అడ్వాన్స్‌గా 15 శాతం నిధులను జమ చేశారు. ఇందుకుగాను రూ.36.37 కోట్లు మంజూరు చేశారు. జూలై 31 నాటికి ఈ పనులను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులను ఆదేశించారు. పేరెంట్‌ కమిటీ వారికి అప్పగించిన పనులను పూర్తి చేసిన తర్వాత రాష్ట్ర  ప్రభుత్వం ఫర్నిచర్, గ్రీన్‌ బోర్డు, ఇంగ్లీష్‌ ల్యాబ్, ఫ్యాన్లు, మరుగుదొడ్లకు అవసరమైన సామగ్రి సరఫరా చేయనుంది. అలాగే రాష్ట్రస్థాయిలో ఎంపిక చేసిన ఏజెన్సీకి పెయింటింగ్‌ పనులను కూడా అప్పగిస్తారు. తొలి విడతలో ఈ పాఠశాలల అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత రెండో విడతలో మిగిలిన పాఠశాలలను అభివృద్ధి చేస్తారు.

జూలై 31 నాటికి పనులు పూర్తి
జిల్లాలోని 1239 పాఠశాల ల అభివృద్ధి పనులను జూ లై 31 నాటికి పూర్తి చేయా లని సీఎం ఆదేశించారు. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేశాం. కచ్చితంగా గడువు లో పనులు పూర్తి చేస్తాం. ఆగస్టు 3న విద్యా సంవ త్సరం ప్రారంభం కానున్నట్లు తెలిపారు. అప్పటికి అభివృద్ధి చెందిన పాఠశాలలను అప్పగిస్తాం.       – పీవీ రమణ, సమగ్ర శిక్షా అభియాన్‌ ఏపీసీ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top