తెలుగుదేశం ఏజెంటుల్లా అధికారులు | officials are tdp agents says ysrcp mla | Sakshi
Sakshi News home page

తెలుగుదేశం ఏజెంటుల్లా అధికారులు

Feb 6 2015 2:55 AM | Updated on Aug 31 2018 8:24 PM

అధికారులు తెలుగుదేశం పార్టీ ఏజెంటుల్లా వ్యవహరిస్తూ.. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రొటోకాల్ పాటించడం లేదంటూ పీలేరు వైఎస్సార్‌సీపీ శాసన సభ్యుడు హైకోర్టును ఆశ్రయించారు.

హైదరాబాద్: అధికారులు తెలుగుదేశం పార్టీ ఏజెంటుల్లా వ్యవహరిస్తూ.. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రొటోకాల్ పాటించడం లేదంటూ పీలేరు వైఎస్సార్‌సీపీ శాసన సభ్యుడు హైకోర్టును ఆశ్రయించారు. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, చిత్తూరు జిల్లా కలెక్టర్, మదనపల్లి ఆర్‌డీవో, చిత్తూరు జెడ్పీ సీఈవో తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. అధికారులు ప్రభుత్వ కార్యక్రమాలకు తనను పిలవకుండా తనపై పోటీ చేసి ఓడిపోయిన అధికార పార్టీ అభ్యర్థి ఇక్బాల్ అహ్మద్ ఖాన్‌ను పిలుస్తున్నారని, రామచంద్రారెడ్డి పిటిషన్‌లో వివరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement