అది సమీక్ష ఎలా?.. కొండా సురేఖకు కడియం కౌంటర్‌ | Kadiyam Srihari counters Konda Surekha | Sakshi
Sakshi News home page

అది సమీక్ష ఎలా?.. కొండా సురేఖకు కడియం కౌంటర్‌

Jul 8 2026 2:54 PM | Updated on Jul 8 2026 3:00 PM

Kadiyam Srihari counters Konda Surekha

సాక్షి, హైదరాబాద్‌: ఆలయాల సమస్యలపైనే కమిషనర్‌ను కలిశానని సమస్యలు వివరించానే తప్ప తాను ఎటువంటి సమీక్ష నిర్వహించలేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆశాఖపై సమీక్ష నిర్వహించే హక్కు తనకు లేదని తెలుసన్నారు.మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలకు బుధవారం ఆయన కౌంటరిచ్చారు.

ప్రోటోకాల్‌ విషయంలో తానేలాంటి తప్పు చేయలేదని  ప్రొటోకాల్‌కు లోబడే తాను పనిచేస్తున్నానని స్పష్టం చేశారు.  అధికారులను తన దగ్గరకు పిలిస్తేనే సమీక్ష అంటారని కొందరు నేతలు కావాలనే దీనిపై ‍అనవసర వివాదం సృష్టిస్తున్నారని కడియం అన్నారు.కాగా నిన్న  దేవాదాయ శాఖ మంత్రి  కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య మళ్ళీ వివాదం తలెత్తింది.సమీక్ష తర్వాత ఉమ్మడి వరంగల్ మాస్టర్ ప్లాన్ కావాలని అధికారులను కడియం కోరారు. 

జిల్లా వ్యవహారాలలో కడియం తల దూర్చడం ఏంటని కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కడియంపై ఏఐసీసీ పెద్దలు, సీఎం రేవంత్‌కు కొండా సురేఖ లేఖ  రాశారు. ఆలయాల అభివృద్ధిపై కడియం ఆదేశాలివ్వడంపై కొండా సురేఖ అసహనం వ్యక్తం చేశారు. అధికార యంత్రాంగంలో కడియం అయోమయం సృష్టిస్తున్నారంటూ సీఎం రేవంత్‌కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కడియం తాజాగా కౌంటరిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement