నేరుగా రైతుల వద్దే పంట కొని.. పేదలకు పంపిణీ

NRIs Help To Indian Farmers And Poor People In Prakasam - Sakshi

సాక్షి, ప్రకాశం: అమెరికాలో నివసిస్తున్న తెలుగువారు ‘టామాటో ఛాలేంజ్’‌ పేరుతో జిల్లాలోని రైతులకు భరోసానిస్తున్నారు. అంతేగాక లాక్‌డౌన్‌లో తిండి దొరక్క ఇబ్బందులు పడుతున్న‌ పేదవారికి అండగా నిలబడ్డారు. ప్రకాశం జిల్లా, గిద్దలూరు నియోజవర్గం, బురుజుపల్లె, ముండ్ల పాడు, వేంకటాపురంలోని 1000 కుటుంబాలకు శుక్రవారం నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఇందుకోసం సాయం చేసిన ఇక్కడి తెలుగువారికి వారు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. కరోనా వైరస్‌ కట్టడి నేపథ‍్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్కడి వారు అక్కడే చిక్కికుపోవడంతో  పండించిన పంటను మార్కెట్‌కు తరలించలేక రైతులు సతమతమవుతున్నారు.

ఇటీవల ఓ రైతు చేతికొచ్చిన తన టమోటా పంటను అమ్మడానికి వీలులేక తన ఆవేదనను ఓ వీడియో ద్వారా సోషల్‌ మీడియాలో పంచుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ వీడియో చూసిన తెలుగు ఎన్‌ఆర్‌ఐ సోదరులు డా. వాసుదేవ రెడ్డి నలిపిరెడ్డి, వెంకటేశ్వర రెడ్డి కల్లూరి, సుబ్బారెడ్డి చింతగుంట, పుల్లారెడ్డి యెదురు, డా. ప్రభాకర్ రెడ్డిలు ఆంధ్రప్రదేశ్లోని కొంతమంది రైతులను ఈ కష్టకాలంలో ఆదుకోవడానికి ముందుకు వచ్చారు. ‘టామాటో చాలేంజ్’‌ పేరుతో జిల్లా రైతులకు భరోసా ఇవ్వడమే కాకుండా పేదవారిని కూడా నిత్యవసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేసి ఈ కష్టకాలంలో వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో ఇందుకోసం టామాట పంటను నేరుగా రైతుల వద్దే కొనుగోలు చేసి వాటిని పేద ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తు ఎన్‌ఆర్‌ఐలు తమ సేవాభావాన్ని చాటుకుంటున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top