జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనకు అవసరమైన 220 విద్యాబోధకుల నియామకానికై అర్హులైన అభ్యర్థులు
విద్యాబోధకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
Oct 21 2013 4:00 AM | Updated on Aug 24 2018 2:33 PM
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనకు అవసరమైన 220 విద్యాబోధకుల నియామకానికై అర్హులైన అభ్యర్థులు ఈనెల 25వ తేదీలోపు దరఖాస్తు చేయాలని రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు అధికారి తన్నీరు శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.
పాఠశాలల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో ఉండి ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉన్న 24 మండలాల్లోని పాఠశాలల్లో విద్యా బోధకులను నియమించనున్నట్లు తెలిపారు. డిగ్రీ-బీఈడీ, ఇంటర్-టీటీసీ అర్హతలు కలిగిన అభ్యర్థులు కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలతో ఆయా మండల విద్యాశాఖాధికారులకు దరఖాస్తు చేయాలని సూచించారు.
మండలాల వారీగా అమరావతి- 2, కాకుమాను- 7, గురజాల- 8, అచ్చంపేట- 15, మాచర్ల- 9, నూజెండ్ల- 14, రెంటచింతల- 19, నిజాంపట్నం- 7, నగరం- 12, మాచవరం- 13, శావల్యాపురం- 6, దుర్గి- 7, పెదనందిపాడు- 7, బెల్లంకొండ- 4, వెల్ధుర్తి- 4, రాజుపాలెం- 17, తాడికొండ- 7, పిట్టలవానిపాలెం- 6, మేడికొండూరు- 10, ఈపూరు- 8, బొల్లాపల్లి- 19- దాచేపల్లి- 5, పెదకూరపాడు- 7, నకరికల్లు- 7 పోస్టులను భర్తీ చేయనున్నామని వివరించారు. పూర్తి వివరాలకు టట్చజఠ్టఠట.జీ వెబ్ సైట్ సందర్శించాలని సూచించారు.
Advertisement
Advertisement