ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని పీజీ కళాశాలల్లో పీజీ కోర్సుల్లో 2016-17 విద్యాసంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించే ఏఎన్‌యూ పీజీ సెట్ నోటిఫికేషన్‌ను సోమవారం వైస్ చాన్సలర్ ఆచార్య ఎ.రాజేంద్రప్రసాద్ విడుదల చేశారు.
గుంటూరు : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని పీజీ కళాశాలల్లో పీజీ కోర్సుల్లో 2016-17 విద్యాసంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించే ఏఎన్‌యూ పీజీ సెట్ నోటిఫికేషన్‌ను సోమవారం వైస్ చాన్సలర్ ఆచార్య ఎ.రాజేంద్రప్రసాద్ విడుదల చేశారు. మార్చి 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.500 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 9వ తేదీ వరకు, రూ. 1000 అపరాధ రుసుంతో ఏప్రిల్ 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రవేశ పరీక్షలు మే నెల 2, 3, 4 తేదీల్లో నిర్వహిస్తామని పీజీ అడ్మిషన్ల డైరెక్టర్ డాక్టర్ ఎం.రామిరెడ్డి తెలిపారు. పూర్తి వివరాలకు, ఆన్‌లైన్ దరఖాస్తుకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చన్నారు. నోటిఫికేషన్ విడుదల కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య పి.రాజశేఖర్, ఏఎన్‌యూ మాజీ రెక్టార్ ఆచార్య వైపీ రామసుబ్బయ్య, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఆచార్య వి.చంద్రశేఖర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆచార్య వై.కిషోర్, పీజీ పరీక్షల కోఆర్డినేటర్ డాక్టర్ వి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.