‘వారం రోజులు నాన్‌ వెజ్‌కు హాలీడే’ | Non Veg Ban In Tanuku Due To Chicken Virus | Sakshi
Sakshi News home page

‘వారం రోజులు నాన్‌ వెజ్‌కు హాలీడే’

Feb 11 2020 12:09 PM | Updated on Feb 11 2020 12:16 PM

Non Veg Ban In Tanuku Due To Chicken Virus - Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి : తణుకు నియోజకవర్గంలో ఓ వైరస్‌ కారణంగా ఫారాల్లోని కోళ్లన్నీ విపరీతంగా చనిపోతున్నాయని స్థానిక ఎమ్మెల్యే కారుమూరి  వెంకట నాగేశ్వరరావు తెలిపారు. చనిపోయిన వైరస్ కోళ్లను కాలువల్లో, రొడ్డు పక్కన వేయకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మున్సిపల్‌, ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ సిబ్బందిని అలర్ట్‌ చేశామని పేర్కొన్నారు. అదే విధంగా తణుకు నియోజకవర్గంలో రేపటి నుంచి వారం రోజులు చికెన్, మటన్‌ అమ్మకాలు నిలిపి వేస్తున్నామని తెలిపారు. ప్రజల ఆరోగ్యమే ప్రధానంగా భావించి వారం రోజులు నాన్‌ వెజ్‌ హాలీడేగా ప్రకటిస్తున్నామని పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement