ఆ వార్తలో నిజం లేదు: రేవంత్‌రెడ్డి | No truth in news: Revanth reddy | Sakshi
Sakshi News home page

ఆ వార్తలో నిజం లేదు: రేవంత్‌రెడ్డి

Oct 23 2013 2:09 AM | Updated on Sep 1 2017 11:52 PM

మహబూబ్‌నగర్ జిల్లాలోని మహబూబ్‌నగర్, హన్వాడ, కోయిలకొండ మండలాల్లో తాగునీటి పథకం కాంట్రాక్టులో తప్పుడు అర్హతపత్రం సమర్పించిన కాంట్రాక్టర్‌కు తాను మద్దతునిస్తున్నట్టు వచ్చిన వార్తలో నిజం లేదని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలోని మహబూబ్‌నగర్, హన్వాడ, కోయిలకొండ మండలాల్లో తాగునీటి పథకం కాంట్రాక్టులో తప్పుడు అర్హతపత్రం సమర్పించిన కాంట్రాక్టర్‌కు తాను మద్దతునిస్తున్నట్టు వచ్చిన వార్తలో నిజం లేదని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అర్హతలున్నవారికే పని దక్కాలని, పోటీ ఉండాలన్న ఉద్దేశంతో శ్రీధర్‌రెడ్డి అనే కాంట్రాక్టర్‌తో టెండర్ వేయించానని, అంతేతప్ప ఆయన తప్పుడు అర్హత పత్రం సమర్పించలేదని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. టీడీపీకే చెందిన మరో కాంట్రాక్టర్ ధర్మారెడ్డి తప్పుడు అర్హత పత్రం సమర్పిస్తే తగిన చర్య తీసుకోవాలని అధికారులను కోరానన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement