అసాధారణ విజయాలివి : విజయసాయిరెడ్డి

No need to fear corona virus says Vijaya sai reddy - Sakshi

సాక్షి, అమరావతి : దేశంలోనే ప్రతి రోజూ అత్యధిక కోవిడ్ వైరస్ పరీక్షలు జరుపుతున్న రాష్ట్రంగా ఏపీ అగ్రస్థానానికి ఎగబాకిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడున్న టెస్టింగ్ ల్యాబ్‌లకుతోడు మిగిలిన జిల్లాల్లో కొత్తవి ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి ఆదేశించారని తెలిపారు. ప్లాస్మా థెరపీకి కేంద్రం నుంచి అనుమతి లభించిందని, ఇవన్నీ అసాధారణ విజయాలని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

‘ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాలన్నిటిలో ప్రతిపక్ష పార్టీలున్నాయి. కరోనా కష్ట కాలంలో ఎక్కడా ప్రభుత్వంపై కుట్ర పూరితంగా వ్యవహరించవు. ప్రజలు పోతే పోయారు గాని ప్రభుత్వానికి మంచి పేరు రావద్దని అనుకోవడం లేదు. ఒక్క ఏపీలో మాత్రం పచ్చ పార్టీ, ఎల్లో మీడియా అలా కోరుకుంటున్నాయి. బాబు పీడ రాష్ట్రానికి విరగడయ్యే నాటికి ఖజానాలో 100  కోట్లే మిగిలాయి. కరోనా వల్ల రాబడి పూర్తిగా తగ్గింది. వచ్చే 2-3 నెలలు ఇలాగే ఉండొచ్చు. లాక్ డౌన్‌లో ఎవరూ ఇబ్బంది పడకూడదని సీఎం జగన్ అనేక చర్యలు తీసుకున్నారు. హామీలు నెరవేస్తున్నారు. అయినా పచ్చ మాఫియా ఏడుస్తూనే ఉంది’ అని విజయసాయిరెడ్డి మండిపడ్డారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top