అంతకు మించిన హీరోయిజం లేదు: వైఎస్‌ జగన్‌

No Heroism Greater Than Motherhood Tweets YS Jagan On MothersDay - Sakshi

సాక్షి, కైకలూరు: ఈ ప్రపంచంలో అమ్మతనానికి మించిన హీరోయిజం మరోటి లేనేలేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆదివారం(మే 13) మదర్స్‌ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘ఈ రోజు నేనీ స్థానంలో ఉన్నానంటే అందుకు అమ్మే కారణం. అమ్మకు ధన్యవాదాలు..’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర(160వ రోజు) చేస్తోన్న వైఎస్‌ జగన్‌.. నేటి ఉదయం కైకలూరు శివారు నుంచి యాత్రను ప్రారంభించారు. కాకతీయ నగర్‌, దెయ్యంపాడు, చింతపాడు, కొవ్వాడ లంక మీదుగా మణుగులూరు చేరుకుంటారు. భోజన విరామం అనంతరం కాలకర్రు మీదుగా మహేశ్వరపురం చేరుకుంటారు. రాత్రికి జననేత అక్కడే బస చేస్తారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top