'498 - ఎ కేసు పెట్టగానే అరెస్టులు వద్దు' | No automatic arrest in 498a, says Home Ministry | Sakshi
Sakshi News home page

'498 - ఎ కేసు పెట్టగానే అరెస్టులు వద్దు'

Oct 26 2014 11:06 AM | Updated on May 25 2018 12:56 PM

'498 - ఎ కేసు పెట్టగానే అరెస్టులు వద్దు' - Sakshi

'498 - ఎ కేసు పెట్టగానే అరెస్టులు వద్దు'

వరకట్న నిరోధక కేసులపై రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ ఆదివారం పలు సూచనలు చేసింది.

న్యూఢిల్లీ: వరకట్న నిరోధక కేసులపై రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ ఆదివారం పలు సూచనలు చేసింది. వరకట్నం కోసం వేధిస్తున్నారంటూ మహిళలు చేసే ఫిర్యాదులతో 498 - ఎ సెక్షన్ కింద కేసు నమోదు చేసినా ...  వెంటనే ఎవరినీ అరెస్ట్ చేయవద్దని సూచించింది. భార్యా, భర్తల మధ్య వివాదాలు నెలకొన్న సమయంలో సెక్షన్ 498-ఎ ను కొంతమంది ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారని కేంద్ర హోంశాఖ అభిప్రాయపడింది.

ఈ నేపథ్యంలో కేసు పెట్టిన వెంటనే అరెస్టులు చేయవద్దని సూచించింది. ఈ మేరకు పోలీసు అధికారులను తగు సూచనలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. కేసు నమోదు అయిన తర్వాత పూర్వాపరాలు పరిశీలించి... అవసరమనుకుంటేనే అరెస్టు చేయాలని కేంద్ర హోంశాఖ జారీ చేసిన సూచనల్లో పేర్కొంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement