breaking news
	
		
	
  No automatic arrest
- 
  
      498A కేసు అరెస్టుల విషయంలో తొందరొద్దు!
- 
      
                   
                                 '498 - ఎ కేసు పెట్టగానే అరెస్టులు వద్దు'
 న్యూఢిల్లీ: వరకట్న నిరోధక కేసులపై రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ ఆదివారం పలు సూచనలు చేసింది. వరకట్నం కోసం వేధిస్తున్నారంటూ మహిళలు చేసే ఫిర్యాదులతో 498 - ఎ సెక్షన్ కింద కేసు నమోదు చేసినా ... వెంటనే ఎవరినీ అరెస్ట్ చేయవద్దని సూచించింది. భార్యా, భర్తల మధ్య వివాదాలు నెలకొన్న సమయంలో సెక్షన్ 498-ఎ ను కొంతమంది ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారని కేంద్ర హోంశాఖ అభిప్రాయపడింది.
 ఈ నేపథ్యంలో కేసు పెట్టిన వెంటనే అరెస్టులు చేయవద్దని సూచించింది. ఈ మేరకు పోలీసు అధికారులను తగు సూచనలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. కేసు నమోదు అయిన తర్వాత పూర్వాపరాలు పరిశీలించి... అవసరమనుకుంటేనే అరెస్టు చేయాలని కేంద్ర హోంశాఖ జారీ చేసిన సూచనల్లో పేర్కొంది. 


