టీడీపీ, బీజేపీలకు పతనం తప్పదు | Next Elections Tdp And Bjp Flaps | Sakshi
Sakshi News home page

టీడీపీ, బీజేపీలకు పతనం తప్పదు

Apr 18 2018 7:44 AM | Updated on Aug 13 2018 8:12 PM

Next Elections Tdp And Bjp Flaps - Sakshi

పోస్టర్‌ విడుదల చేస్తున్న సీపీఎం నాయకులు

కొత్తపల్లె : ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ రైతు సంక్షేమాన్ని విస్మరించిన బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలకు రాబోయే ఎన్నికలలో పతనం తప్పదని సీపీఎం మండల కార్యదర్శి స్వాములు, సంజీవరాయుడు హెచ్చరించారు. మంగళవారం కొత్తపల్లెలో అఖిలభారత 22వ మహాసభల పోస్టర్‌ను వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 18నుంచి 22వ తేదీ వరకు హైదరాబాద్‌ పట్టణంలో జరిగే అఖిలభారత 22వ మహాసభలను విజయవంతం చేసేందుకు మండలంలోని సీపీఎం కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు.

5 రోజులపాటు సాగే ఈ మహాసభలలో ప్రజా సమస్యలపై చర్చించడంతో పాటు కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై చేపట్టబోయే కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జాన్, దాసు, యేసన్న, స్వామిదాసు, వెంకటరమణ, యేసుకుమార్, దేవకుమార్, శేషన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement