breaking news
kottapalle
-
టీడీపీ, బీజేపీలకు పతనం తప్పదు
కొత్తపల్లె : ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ రైతు సంక్షేమాన్ని విస్మరించిన బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలకు రాబోయే ఎన్నికలలో పతనం తప్పదని సీపీఎం మండల కార్యదర్శి స్వాములు, సంజీవరాయుడు హెచ్చరించారు. మంగళవారం కొత్తపల్లెలో అఖిలభారత 22వ మహాసభల పోస్టర్‌ను వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 18నుంచి 22వ తేదీ వరకు హైదరాబాద్ పట్టణంలో జరిగే అఖిలభారత 22వ మహాసభలను విజయవంతం చేసేందుకు మండలంలోని సీపీఎం కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. 5 రోజులపాటు సాగే ఈ మహాసభలలో ప్రజా సమస్యలపై చర్చించడంతో పాటు కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై చేపట్టబోయే కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జాన్, దాసు, యేసన్న, స్వామిదాసు, వెంకటరమణ, యేసుకుమార్, దేవకుమార్, శేషన్న తదితరులు పాల్గొన్నారు. -
హత్య కేసులో నలుగురు అరెస్టు
రాయచోటి : స్థానిక కొత్తపల్లెలోని అలీమాబాద్‌వీధిలో నివాసం ఉన్న పఠాన్ ఫయాజ్‌ఖాన్ అనే వ్యక్తి హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. అరెస్టు వివరాలను సోమవారం సాయంత్రం అర్బన్ సీఐ మహేశ్వర్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. గత నెల 6వ తేదీన ఫయాజ్‌ఖాన్‌ను షేక్.యూనస్, షేక్.ముష్రఫ్, షేక్.కమాల్‌బాషా, షేక్. మహమ్మద్‌అలీలు కలిసి కత్తులతో దాడి చేసి హత్య చేశారు. అలీమాబాద్‌వీధికి చెందిన యూనస్, ముష్రఫ్‌లు జులాయిగా తిరుగుతూ మహిళలను వేధించేవారు. అలాగే హతుడు ఫయాజ్‌ఖాన్ బంధువులకు చెందిన మహిళలను కూడా వేధించారు. ఈ విషయం తెలిసిన ఫయాజ్‌ఖాన్ వారిని మందలించాడు. దీనిని అవమానంగా భావించిన యూనస్, ముష్రఫ్‌లు కమాల్‌బాష, మహమ్మద్‌అలీలతో కలిసి కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఫయాజ్‌ఖాన్‌ను తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ కేసులో నిందితులు నలుగురిని సోమవారం మదనపల్లె మార్గంలోని రింగు రోడ్డు వద్ద అరెస్టు చేశారు. వారు ఉపయోగించిన కత్తులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రాయచోటి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా రిమాండ్‌కు ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్ఐలు రమేష్‌బాబు, మైనుద్దీన్, మహమ్మద్‌రఫీ పాల్గొన్నారు.