వేడుకల్లో విషాదం...స్నేహితుడు గొంతు కోశాడు | New Year's Tragedy in Dharmavaram | Sakshi
Sakshi News home page

వేడుకల్లో విషాదం...స్నేహితుడు గొంతు కోశాడు

Jan 1 2014 10:57 AM | Updated on Oct 17 2018 4:32 PM

నూతన సంవత్సరం సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో అనంతపురం జిల్లా ధర్మవరంలో దారుణం చోటు చేసుకుంది.

అప్పటివరకూ ఎంతో సంతోషంగా నూతన సంవత్సర వేడుకల్లో పాలుపంచుకున్నారు. అంతలోనే ఏం జరిగిందో ఏమో .. స్నేహితుల మధ్య గొడవ మొదలైంది. చిలికి చిలికి గాలివానగా మారడంతో, స్నేహితుడిని మరో మిత్రుడు కత్తితో గొంతుకోసి పరారయ్యాడు. ఇందిరానగర్‌కు చెందిన డిగ్రీ విద్యార్థి సోమశేఖర్‌ ఈ వివాదంలో బలయ్యాడు.

ఈ విషాద ఘటన అనంతపురంజిల్లా ధర్మవరంలో కలకలం రేపింది. అయితే అతడి స్నేహితుడైన హరి ఈ పని చేశాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం సోమశేఖర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement