‘సబ్‌ప్లాన్’పై నిర్లక్ష్యం! | Neglect on Sub Plan in Vizianagaram | Sakshi
Sakshi News home page

‘సబ్‌ప్లాన్’పై నిర్లక్ష్యం!

Aug 26 2014 12:41 AM | Updated on Sep 15 2018 2:43 PM

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం అమలుపై పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ చట్టం ద్వారా గత ఏడాది జిల్లాకు పూర్తి గా నిధులు చేయకపోగా... ఈసారి కూడా అదే వైఖరి కనబరిచా రు.

విజయనగరం ఫూల్‌బాగ్: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం అమలుపై పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ చట్టం ద్వారా గత ఏడాది జిల్లాకు పూర్తి గా నిధులు చేయకపోగా... ఈసారి కూడా అదే వైఖరి కనబరిచా రు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కూడా సబ్‌ప్లాన్‌కు కేటాయించి న నిధులపై ప్రస్తావన లేదు. దళితులు, గిరిజనుల సంక్షేమం కోసం గత ప్రభుత్వం 2013, జనవరి 24వ తేదీ ఎంతో ఆర్భాటంగా ఈ చట్టాన్ని అమలు చేసింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 2013, ఏప్రిల్ నెలలో దళితులకు రూ. 8585 కోట్లు, గిరిజనులకు రూ.3666 కోట్లు సబ్‌ప్లాన్ బడ్జెట్‌లో   నిధు లు కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా దళితులు 2,14,839 మంది ఉన్నారు.
 
 వీరికి జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. కానీ జిల్లాకు 2013-14 ఆర్థిక సంవత్సరానికి గాను నిధులు మంజూరు కాలేదు. దీంతో ఆ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ రుణాలు కూడా మంజూరు కాలేదు. ఆ ఏడాది జిల్లావ్యాప్తంగా వివిధ రుణాల కోసం 697 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 536 మందిని లబ్ధిదారులుగా అధికారులు గుర్తించారు. వీరికి రుణాల మంజూరుకు రూ.3 కోట్ల అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశారు. కానీ ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. ఇటీవల అసెంబ్లీ లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సబ్ ప్లాన్ గురించి కాని, దానికి కేటాయించిన నిధులపై కానీ కనీసం ప్రస్తావించలేదు. రాష్ట్రంలో మొత్తం 83 లక్షల మంది దళితులున్నారు.
 
 ప్రభుత్వం బడ్జెట్‌లో సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా రూ.2657 కోట్లు మాత్రమే ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. అలాగే గిరిజన సంక్షేమ శాఖకు రూ.1150 కోట్లు కేటారుుస్తున్నట్టు ప్రకటించింది. అలాగే ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలకు ఎంతోకొంత మేరకు నిధులు కేటాయించారు. కానీ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌కు మాత్రం ఎలాంటి నిధుల కేటాయింపు లేదు. దీనిపై దళిత సంఘాల నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం అమల్లోకి వచ్చి ఇప్పటికి 20 నెలలు గడుస్తోంది. ఈ చట్టాన్ని అమలు చేయడంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యారుు. దళితులు, గిరిజనుల కోసం కేటాయించాల్సిన నిధులను దారి మళ్లిస్తున్నారన్న విమర్శలు ఉన్నారుు. అందులో భాగంగానే గతేడాది రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు కేటాయించాల్సిన రూ.5 వేల కోట్లు దారి మళ్లాయి. ఈ నిధులను ఇతర రంగాలకు కేటాయిస్తున్నారని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి.
 
 ప్రణాళికా బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ జనాభా శాతానికి తగ్గకుండా నిధులు వేరు చేసి ఆ మొత్తాన్ని ఎస్సీ, ఎస్టీ నోడల్ ఏజెన్సీలకు కేటాయించాల్సి ఉంది. సాధారణ సంక్షేమ పథకాలకు ఖర్చు చేసే నిధులను సబ్‌ప్లాన్ నిధులుగా చూపిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్ట్‌లు, ఇతర మౌలిక సదుపాయాలకు ఖర్చు చేసే నిధుల్లో ఎస్సీ నుంచి 7 శాతం, ఎస్టీ నుంచి 3 శాతం నిధులను సబ్ ప్లాన్ నిధుల నుంచి కోత విధించాలన్న ప్రభుత్వ ప్రతిపాదన సరైనది కాదని దళిత సంఘాల నేతలు అంటున్నారు. అనివార్య పరిస్థితులలో ఖర్చు కాకుం డా సబ్‌ప్లాన్ నిధులు మిగిలిపోతే వాటిని మురిగిపోనివ్వకుండా వచ్చే ఏడాది సబ్‌ప్లాన్ నిధుల్లో కలిపి అదనంగా కేటాయించాల్సి ఉంది. అది ఎక్కడా అమలు కావడం లేదు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement