టిడిపి మంత్రిపై నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు | Natti Kumar sensational comments on TDP minister | Sakshi
Sakshi News home page

టిడిపి మంత్రిపై నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు

Aug 25 2014 8:51 PM | Updated on Aug 10 2018 9:40 PM

నట్టి కుమార్ - Sakshi

నట్టి కుమార్

ఏపిలో టిడిపి మంత్రి, అతని అనుచరులపై చిన్న నిర్మాతల మండలి అధ్యక్షుడు నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

విశాఖపట్నం: ఏపిలో టిడిపి మంత్రి, అతని అనుచరులపై చిన్న నిర్మాతల మండలి అధ్యక్షుడు నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక టిడిపి మంత్రి, అతని అనుచరులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు.  2006-12 వరకు సర్వీసు ట్యాక్స్‌ మాఫీ చేయిస్తామంటూ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో థియేటర్ యజమాని వద్ద 50 వేల రూపాయల చొప్పున వసూలు చేసినట్లు ఆయన చెప్పారు.

ఒక టిడిపి మంత్రి, ఆయన అనుచరుడు అశోక్‌కుమార్‌, గోవిందరాజు అనే మధ్యవర్తి కలిసి 12 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్లు వివరించారు. వారితోపాటు ఎన్వీ ప్రసాద్‌,  పూర్వీ రాజు, చిన్ని, జనార్ధన్‌, అలంకార్ ప్రసాద్‌లు కూడా వసూళ్లకు పాల్పడినట్లు  ఆరోపించారు.  అవినీతిని నిర్మూలిస్తామని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ఈ అవినీతిని ఎందుకు అడగటంలేదని ఆయన ప్రశ్నించారు. 24 గంటల్లోగా వసూళ్లకు పాల్పడిన వారిని అరెస్టు చేయాలని నట్టి కుమార్ డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement