బాబు ప్రమాణానికి ప్రధాని రావట్లేదు... | Narendra modi not attend chandrababu's swearing-in ceremony | Sakshi
Sakshi News home page

బాబు ప్రమాణానికి ప్రధాని రావట్లేదు...

Jun 7 2014 8:39 AM | Updated on Mar 29 2019 9:24 PM

బాబు ప్రమాణానికి ప్రధాని రావట్లేదు... - Sakshi

బాబు ప్రమాణానికి ప్రధాని రావట్లేదు...

ద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రం హాజరు కావడం లేదని బీజేపీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యాంకిశోర్ హైదరాబాద్లో తెలిపారు.

హైదరాబాద్ : చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రం హాజరు కావడం లేదని బీజేపీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యాంకిశోర్ హైదరాబాద్లో తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి రాజనాథ్ సింగ్, వెంకయ్యనాయుడు, నిర్మాల సీతారామన్, రవిశంకర్ ప్రసాద్లతో సహా సుమారు పదిమంది కేంద్రమంత్రులు వస్తున్నారని చెప్పారు.

పార్టీ సీనియర్ నేత అద్వానీ కూడా వచ్చే అవకాశం ఉందని ఆయన నిన్న తెలిపారు. అలాగే... ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్), రమణ్ సింగ్ (ఛత్తీస్గఢ్), ప్రకాశ్ సింగ్ బాదల్ (పంజాబ్), మనోహర్ పారికర్ (గోవా)లు ఈ కార్యక్రమానికి హాజరు అవుతున్నారు. వీరితో పాటు...ఒడిశా, తమిళనాడు ముఖ్యమంత్రులు నవీన్ పట్నాయక్, జయలలితలు కూడా హాజరు అవుతున్నట్లు టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన చెప్పారు.

 

Advertisement
 
Advertisement
Advertisement