‘నారాయణ’ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం | 'Narayana' student to commit suicide | Sakshi
Sakshi News home page

‘నారాయణ’ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

Dec 31 2015 2:41 AM | Updated on Nov 9 2018 4:36 PM

అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని నారాయణ విద్యాసంస్థలో ఇంటర్మీడియెట్ (ద్వితీయ) చదువుతున్న తేజస్విని అనే

సాక్షి, కదిరి: అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని నారాయణ విద్యాసంస్థలో ఇంటర్మీడియెట్ (ద్వితీయ)  చదువుతున్న తేజస్విని అనే విద్యార్థిని బుధవారం సాయంత్రం ఆత్మహత్యాయత్నం చేసింది. చదువుకోవాలంటూ ప్రిన్సిపాల్ వేధింపులు అధికం కావడంతో పురుగు మందు తాగింది. దీంతో విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు కళాశాల ఎదుట ధర్నా చేపట్టారు. కదిరి పట్టణంలోని అడపాలవీధిలో నివాసముంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాజారెడ్డి కుమార్తె తేజస్విని.  కొన్నాళ్లుగా  ప్రిన్సిపాల్ నాగరాజు ఆమె కళాశాలకు రాలేదంటూ వేధించేవారు. ఈ నేపథ్యంలోనే రెండు నెలల క్రితం  ‘నా కుమార్తె బాగా చదవలేదు. మంచి మార్కులు తెచ్చుకోలేదు.

ఏమైనా అఘాయిత్యానికి పాల్పడితే కళాశాలకు ఎలాంటి సంబంధం లేద’ని విద్యార్థిని తండ్రి రాజారెడ్డితో లెటర్ కూడా రాయించుకున్నారు.  ఈ  క్రమంలో తేజస్విని బుధవారం ఉదయం 9.30 గంటలకు ఇంటి నుంచి వెళ్లింది. నల్లచెరువు సమీపంలోని షిర్డీసాయి  ఆలయంలో పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి చేరుకుంది. తల్లిదండ్రులు      బాధితురాలిని  ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement