breaking news
Tejasvini
-
పసిడి బుల్లెట్...
తొలి రోజే మొదలైన భారత పసిడి పతకాల వేట తొమ్మిదో రోజూ నిరాటంకంగా కొనసాగింది. అయితే ఎవరూ ఊహించని విధంగా 15 ఏళ్ల కుర్రాడు అనీశ్ భన్వాలా షూటింగ్ విభాగంలో స్వర్ణ పతకం గెలిచి సంచలనం సృష్టించాడు. తొలిసారి ఈ గేమ్స్‌లో పాల్గొంటున్న అతను పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో కామన్వెల్త్ గేమ్స్ రికార్డు నెలకొల్పడంతో పాటు బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో హరియాణాకు చెందిన ఈ పదో తరగతి విద్యార్థి కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో భారత్ తరఫున స్వర్ణ పతకం గెలిచిన పిన్న వయసు క్రీడాకారుడిగా కొత్త చరిత్ర లిఖించాడు. మరోవైపు మహిళల రైఫిల్ త్రీ పొజిషన్ విభాగంలో 37 ఏళ్ల తేజస్విని సావంత్ విజేతగా నిలిచింది. పురుషుల రెజ్లింగ్‌లో అంచనాలను నిజం చేస్తూ బజరంగ్ పూనియా 65 కేజీల విభాగంలో పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. టీటీ, బాక్సింగ్‌లోనూ మనోళ్లు మెరవడంతో... గోల్డ్‌కోస్ట్ గేమ్స్‌లో తొమ్మిదో రోజు భారత్ తమ అత్యుత్తమ ప్రదర్శన చేసి మూడు స్వర్ణాలు, నాలుగు రజతాలు, నాలుగు కాంస్యాలతో కలిపి మొత్తం 11 పతకాలను దక్కించుకుంది. గోల్డ్‌కోస్ట్: పెన్ను పట్టుకొని తరగతి గదిలో పరీక్ష రాయాల్సిన కుర్రాడు... దేశం తరఫున గన్ను పట్టుకొని బరిలోకి దిగాడు. కచ్చితమైన గురితో లక్ష్యంలోకి బుల్లెట్లు దించాడు. రౌండ్ రౌండ్‌కు ఒక్కో ప్రత్యర్థిని వెనక్కి నెట్టేశాడు. ఊహించని రీతిలో విజేతగా అవతరించి ఔరా అనిపిం చాడు. అందివచ్చిన ఏకైక అవకాశాన్ని స్వర్ణం తో సద్వినియోగం చేసుకున్న ఆ పసిడి బుల్లెట్ ఎవరో కాదు హరియాణాకు చెందిన 15 ఏళ్ల అనీశ్ భన్వాలా. 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో బరిలోకి దిగిన అతను ఫైనల్లో 30 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో 23 పాయింట్లతో డేవిడ్ చాప్మన్ (ఆస్ట్రేలియా) పేరిట ఉన్న కామన్వెల్త్ గేమ్స్ రికార్డును బద్దలు కొట్టాడు. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో మహారాష్ట్ర షూటర్ తేజస్విని సావంత్ చాంపియన్‌గా నిలిచి భారత్ ఖాతాలో స్వర్ణ పతకాన్ని జమ చేసింది. ఫైనల్లో తేజస్విని 457.9 పాయింట్లు స్కోరు చేసి 449.1 పాయింట్లతో జియాంగ్ (సింగపూర్) పేరిట ఉన్న కామన్వెల్త్ గేమ్స్ రికార్డును బద్దలు కొట్టింది. భారత్‌కే చెందిన అంజుమ్ (455.7 పాయింట్లు) రెండో స్థానంలో నిలిచి రజతం గెల్చుకుంది. భళా... బజరంగ్ రెజ్లింగ్ ఈవెంట్లో రెండో రోజు కూడా భారత్ ఖాతాలో నాలుగు పతకాలు చేరాయి. పురుషుల 65 కేజీల విభాగంలో బజరంగ్ పూనియా స్వర్ణ పతకాన్ని నెగ్గాడు. నలుగురు ప్రత్యర్థులతో పోటీపడిన బజరంగ్ ఒక్కరికి ఒక్క పాయింట్ కూడా ఇవ్వకపోవడం విశేషం. కేన్ చారిగ్ (వేల్స్)తో జరిగిన ఫైనల్లో బజరంగ్ 10–0తో మూడు నిమిషాల్లోపే బౌట్‌ను ముగించాడు. తొలి రౌండ్లో బజరంగ్ 10–0తో రిచర్డ్స్ (న్యూజిలాండ్)పై, క్వార్టర్ ఫైనల్లో 10–0తో అమాస్ (నైజీరియా)పై, సెమీఫైనల్లో 10–0తో విన్సెంట్ (కెనడా)పై గెలుపొందాడు. పురషుల 97 కేజీల ఫైనల్లో మౌజమ్ ఖత్రీ (భారత్) 2–12తో ఎరాస్మస్ (దక్షిణాఫ్రికా) చేతిలో ఓడిపోయి రజతంతో సరిపెట్టుకున్నాడు. మహిళల 57 కేజీల ఫైనల్లో పూజా ధండా (భారత్) 5–7తో ఒడునాయో (నైజీరియా) చేతిలో ఓటమిపాలై రజతం గెలుపొందగా... 68 కేజీల విభాగంలో షెరీన్ సుల్తానా (బంగ్లాదేశ్)పై దివ్య కక్రాన్ నెగ్గి కాంస్యం సంపాదించింది. మనిక మళ్లీ మెరిసె... మహిళల టేబుల్ టెన్నిస్ (టీటీ) టీమ్ విభాగంలో స్వర్ణంతో మెరిసిన భారత క్రీడాకారిణులు డబుల్స్ విభాగంలోనూ ఆకట్టుకున్నారు. టీమ్‌కు స్వర్ణం దక్కడంలో కీలకపాత్ర పోషించిన మనిక బాత్రా తన భాగస్వామి మౌమా దాస్‌తో కలిసి డబుల్స్‌లో రజతం గెల్చుకుంది. ఫైనల్లో మనిక–మౌమా దాస్ జంట 0–3తో ఫెంగ్ తియన్వె–యు మెంగ్యు (సింగపూర్) జోడీ చేతిలో పరాజయం పాలైంది. హుసాముద్దీన్‌కు కాంస్యం పురుషుల బాక్సింగ్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు లభించాయి. ఐదుగురు బాక్సర్లు అమిత్ (49 కేజీలు), గౌరవ్ సోలంకి (52 కేజీలు), మనీశ్ కౌశిక్ (60 కేజీలు), వికాస్ కృషన్ (75 కేజీలు), సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు) ఫైనల్లోకి దూసుకెళ్లగా... తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ (56 కేజీలు), మనోజ్ కుమార్ (69 కేజీలు), నమన్ తన్వర్ (91 కేజీలు) సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలు గెల్చుకున్నారు. సెమీస్‌లో హుసాముద్దీన్ 0–5తో పీటర్ మెక్‌గ్రెయిల్ (ఇంగ్లండ్) చేతిలో ఓటమి చవిచూశాడు. లెక్కల పరీక్ష గురించే ఆలోచనంతా... మనలో చాలామందికి గణితమంటే భయం... ఇక ఆ సబ్జెక్టులో పరీక్షంటే చెప్పేదేముంది? ఒత్తిడితో వణికిపోతాం. కామన్వెల్త్ క్రీడల షూటింగ్లో స్వర్ణం నెగ్గిన అనీశ్ భన్వాలా కూడా దీనికి అతీతుడేం కాదు. పదిహేనేళ్ల అతి పిన్న వయసులోనే పతకం నెగ్గిన తన ఘనత గురించి దేశమంతా మాట్లాడుకుంటుంటే, అతడేమో లెక్కల పరీక్ష గురించి ఆందోళన చెందుతున్నాడు. తుపాకీ పట్టి సడలని ఏకాగ్రత, సాధనతో గురి చూసి లక్ష్యాన్ని కొట్టిన తాను... గణితం సబ్జెక్టును మాత్రం సరిగా సాధన చేయలేదని చెబుతున్నాడు. హరియాణాలోని సోనేపట్ జిల్లా గొహనా కసండీకి చెందినవాడు అనీశ్. షూటింగేమీ అతడి మొదటి ప్రాధాన్య క్రీడ కాదు. 2013లో అండర్–12 స్థాయిలో మోడ్రన్ పెంటాథ్లాన్ ప్రపంచ చాంపియన్‌షిప్, 2015లో ఆసియా పెంటాథ్లాన్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడు. తర్వాత నుంచి షూటింగ్‌పై దృష్టి పెట్టాడు. దీనికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం దక్కింది. ఆటే సర్వస్వంగా భావిస్తూ పైకెదిగాడు. గత నెల మెక్సికోలో జరిగిన ప్రపంచకప్, జూనియర్ ప్రపంచ కప్‌లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అక్కడ కనబర్చిన ప్రతిభతో కామన్వెల్త్ గేమ్స్‌కు వచ్చాడు. ‘రేంజ్లో ఒత్తిడిని ఆస్వాదిస్తా. అది నాలో ప్రతిభను బయటకు తీస్తుంది. కామన్వెల్త్లో నాకేం రికార్డు లేదు. కానీ ఈసారి ముద్ర వేయాలని నిశ్చయించుకున్నా’ అని ఓవైపు ఆత్మవిశ్వాసంతో చెప్పే అనీశ్... ‘భారత్‌లో దిగిన వెంటనే నేను పదో తరగతి పరీక్షలు రాయాల్సి ఉంది. హిందీ, సోషల్ సబ్జెక్టుల్లో ఫర్వాలేదు. లెక్కల గురించే నా ఆందోళనంతా. ఇప్పుడైనా దృష్టి పెట్టాలి’ అని అంటుండటం గమనార్హం. వారాంతాల్లో సరదాగా గడపటం ఎలా అని ఆలోచించే తన వయసు కుర్రాళ్లలా కాకుండా... ‘నా దృష్టంతా వచ్చే ప్రపంచకప్, ఆసియా క్రీడలపైనే ఉంద’ని చెబుతున్నాడీ టీనేజర్. -
బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
ఘట్కేసర్లోని ఓ హోస్టల్లో తేజశ్విని(19) అనే బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు..నల్గొండ జిల్లా ఆత్మకూరుకు చెందిన తేజశ్విని ఘట్కేసర్లోని కృష్ణమూర్తి ఇంజనీరింగ్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతోంది. సెమిస్టర్ పరీక్షలో ఫెయిల్ అయినందుకు మనస్తాపం చెందిన తేజశ్విని హాస్టల్ రూంలో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గుర్తింపు తెచ్చే ఏ పాత్రైనా ఓకే!
వర్ధమాన నటి తేజస్విని కొత్తపేట : సినిమా, సీరియల్స్‌లో గుర్తింపు తెచ్చే ఏ పాత్రనైనా చేస్తానని సినిమా, సీరియల్స్ వర్ధమాన నటి జి.తేజస్విని అన్నారు. పలు టీవీ సీరియల్స్, సినిమాల్లో సహాయ నటిగా రాణిస్తున్న ఆమె కొత్తపేట మండలం వాడపాలెంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆమె సాక్షితో మాట్లాడారు. ప్రస్తుతం తాను రాధాగోపాలం టీవీ సీరియల్లో హీరోయిన్ ఫ్రెండ్‌గా, అమెరికా అమ్మాయిలో పని అమ్మాయిగా, నాగబాబు సీతామహాలక్ష్మిలో జబర్దస్త్ నాగి వైఫ్ క్యారెక్టర్, అగ్నిపూలులో రిపోర్టర్‌గా, నాపేరు మీనాక్షిలో నర్స్ క్యారెక్టర్లో నటిస్తున్నానన్నారు. సంగీత దర్శకుడు కోటిగారి అబ్బాయి హీరోగా నటిస్తున్న టైటానిక్, రాజా చేయివేస్తే, ప్రేమంటే సులువు కాదురా! సినిమాలతో పాటు మళయాళం నటుడు మోహన్‌లాల్ హీరోగా తెలుగు, తమిళం, మళయాళం బాషల్లో (తెలుగులో మనమందరం) సినిమాలో మోహన్‌లాల్ సూపర్‌బజార్ టీమ్ సభ్యురాలిగా నటిస్తున్నట్టు తెలిపారు. -
విష పురుగు కాటుతో చిన్నారి మృతి
విషపు పురుగు కాటుతో ఓ చిన్నారి మృత్యువాత పడింది. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం మీర్జాన్పల్లి గ్రామంలో తేజశ్విని (4) అనే చిన్నారిని శనివారం రాత్రి విషపురుగు కాటు వేయగా జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారి ఆదివారం ఉదయం మృతి చెందింది. -
‘నారాయణ’ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
సాక్షి, కదిరి: అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని నారాయణ విద్యాసంస్థలో ఇంటర్మీడియెట్ (ద్వితీయ) చదువుతున్న తేజస్విని అనే విద్యార్థిని బుధవారం సాయంత్రం ఆత్మహత్యాయత్నం చేసింది. చదువుకోవాలంటూ ప్రిన్సిపాల్ వేధింపులు అధికం కావడంతో పురుగు మందు తాగింది. దీంతో విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు కళాశాల ఎదుట ధర్నా చేపట్టారు. కదిరి పట్టణంలోని అడపాలవీధిలో నివాసముంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాజారెడ్డి కుమార్తె తేజస్విని. కొన్నాళ్లుగా ప్రిన్సిపాల్ నాగరాజు ఆమె కళాశాలకు రాలేదంటూ వేధించేవారు. ఈ నేపథ్యంలోనే రెండు నెలల క్రితం ‘నా కుమార్తె బాగా చదవలేదు. మంచి మార్కులు తెచ్చుకోలేదు. ఏమైనా అఘాయిత్యానికి పాల్పడితే కళాశాలకు ఎలాంటి సంబంధం లేద’ని విద్యార్థిని తండ్రి రాజారెడ్డితో లెటర్ కూడా రాయించుకున్నారు. ఈ క్రమంలో తేజస్విని బుధవారం ఉదయం 9.30 గంటలకు ఇంటి నుంచి వెళ్లింది. నల్లచెరువు సమీపంలోని షిర్డీసాయి ఆలయంలో పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి చేరుకుంది. తల్లిదండ్రులు బాధితురాలిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. -
మినీ భారతం!
మహాభారతంలోని శ్రీకృష్ణుడు, పంచపాండవులు మళ్లీ తెరపై ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది? అది తెలియాలంటే ‘సినీ మహల్’ చూడాల్సిందే. సిద్దాంశ్, రాహుల్, తేజస్విని ముఖ్యతారలుగా లక్ష్మణ్ వర్మ దర్శక త్వంలో బి.రమేశ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను దర్శకుడు మారుతి హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ వర్మ మాట్లాడుతూ- ‘‘ఈ చిత్రం మినీ మోడ్రన్ మహాభారతాన్ని పోలినట్లుగా ఉంటుంది. వినూత్న కథాంశంతో సాగే చిత్రం. కచ్చితంగా అందరికీ నచ్చే సినిమా అవుతుంది’’అని చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్ర సహ నిర్మాతలు పార్ధు, బాలాజీ , మురళీధర్, దర్శకుడు ప్రవీణ్ సత్తార్ తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లి సంబంధాలు చెడగొడుతున్నారని.. యువతి ఆత్మహత్య
గౌతంనగర్: పెళ్లి సంబంధాలు చెడగొడుతున్నారని యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై నాగేశ్వర్రావు తెలిపిన వివరాలు.. మౌలాలికి చెందిన నర్సింహాచారి స్వర్ణ భార్యాభర్తలు. వీరి కూతురు ఎస్.తేజస్విని (22) ఎమ్మెస్సీ మొదటి సంవత్సరం విద్యార్థిని. ఆమెకు ఆరునెలల క్రితం పెళ్లి సంబంధం కుదిరింది. కుటుంబసభ్యులు పెళ్లి ఏర్పాట్లు పూర్తి చేసి పత్రికలు కూడా ముద్రించారు. అయితే వారి బంధువులు ఆమెపై దుష్ర్పచారం చేసి సంబంధం చెడగొట్టారు. ఇటీవల మరో సంబంధాన్ని కూడా వారే చెడగొట్టారని మనస్తాపం చెంది సూసైడ్ నోట్ రాసి శనివారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో తేజస్విని తండ్రి నర్సింహాచారి మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తేజస్విని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఐస్‌క్రీమ్ బ్యూటీ
సికింద్రాబాద్ కార్ఖానాలో ఏర్పాటు చేసిన కాయ స్కిన్ క్లినిక్ ప్రారంభోత్సవంలో ‘ఐస్‌క్రీమ్’ బ్యూటీ తేజస్విని మురిపించింది. బ్రైట్ కలర్ శారీలో... ట్రెడిషనల్ లుక్స్‌తో మైమరిపించింది. సాక్షి, సిటీప్లస్