పెళ్లి సంబంధాలు చెడగొడుతున్నారని.. యువతి ఆత్మహత్య | A young woman committed suicide | Sakshi
Sakshi News home page

పెళ్లి సంబంధాలు చెడగొడుతున్నారని.. యువతి ఆత్మహత్య

Nov 30 2014 12:36 AM | Updated on Nov 6 2018 8:04 PM

పెళ్లి సంబంధాలు చెడగొడుతున్నారని..  యువతి ఆత్మహత్య - Sakshi

పెళ్లి సంబంధాలు చెడగొడుతున్నారని.. యువతి ఆత్మహత్య

పెళ్లి సంబంధాలు చెడగొడుతున్నారని యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధి...

గౌతంనగర్:  పెళ్లి సంబంధాలు చెడగొడుతున్నారని యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై నాగేశ్వర్రావు తెలిపిన వివరాలు.. మౌలాలికి  చెందిన నర్సింహాచారి స్వర్ణ భార్యాభర్తలు. వీరి కూతురు ఎస్.తేజస్విని (22) ఎమ్మెస్సీ మొదటి సంవత్సరం విద్యార్థిని. ఆమెకు ఆరునెలల క్రితం పెళ్లి సంబంధం కుదిరింది. కుటుంబసభ్యులు పెళ్లి ఏర్పాట్లు పూర్తి చేసి పత్రికలు కూడా ముద్రించారు. అయితే వారి బంధువులు ఆమెపై దుష్ర్పచారం చేసి సంబంధం చెడగొట్టారు.

ఇటీవల మరో సంబంధాన్ని కూడా వారే చెడగొట్టారని మనస్తాపం చెంది సూసైడ్ నోట్ రాసి  శనివారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో తేజస్విని తండ్రి నర్సింహాచారి మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తేజస్విని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement