గుర్తింపు తెచ్చే ఏ పాత్రైనా ఓకే! | tejasvini interview with sakshi | Sakshi
Sakshi News home page

గుర్తింపు తెచ్చే ఏ పాత్రైనా ఓకే!

Jun 4 2016 9:17 AM | Updated on Apr 4 2019 3:25 PM

తేజస్విని, అమెరికా అమ్మాయి సీరియల్ లోని స్టిల్ - Sakshi

తేజస్విని, అమెరికా అమ్మాయి సీరియల్ లోని స్టిల్

సినిమా, సీరియల్స్‌లో గుర్తింపు తెచ్చే ఏ పాత్రనైనా చేస్తానని సినిమా, సీరియల్స్ వర్ధమాన నటి జి.తేజస్విని అన్నారు.

వర్ధమాన నటి తేజస్విని


కొత్తపేట :  సినిమా, సీరియల్స్‌లో గుర్తింపు తెచ్చే ఏ పాత్రనైనా చేస్తానని సినిమా, సీరియల్స్ వర్ధమాన నటి జి.తేజస్విని అన్నారు. పలు టీవీ సీరియల్స్, సినిమాల్లో సహాయ నటిగా రాణిస్తున్న ఆమె కొత్తపేట మండలం వాడపాలెంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆమె సాక్షితో మాట్లాడారు.

ప్రస్తుతం తాను రాధాగోపాలం టీవీ సీరియల్‌లో హీరోయిన్ ఫ్రెండ్‌గా, అమెరికా అమ్మాయిలో పని అమ్మాయిగా, నాగబాబు సీతామహాలక్ష్మిలో జబర్దస్త్ నాగి వైఫ్ క్యారెక్టర్, అగ్నిపూలులో రిపోర్టర్‌గా, నాపేరు మీనాక్షిలో నర్స్ క్యారెక్టర్‌లో నటిస్తున్నానన్నారు. సంగీత దర్శకుడు కోటిగారి అబ్బాయి హీరోగా నటిస్తున్న టైటానిక్, రాజా చేయివేస్తే, ప్రేమంటే సులువు కాదురా! సినిమాలతో పాటు మళయాళం నటుడు మోహన్‌లాల్ హీరోగా తెలుగు, తమిళం, మళయాళం బాషల్లో (తెలుగులో మనమందరం) సినిమాలో మోహన్‌లాల్ సూపర్‌బజార్ టీమ్ సభ్యురాలిగా నటిస్తున్నట్టు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement