మినీ భారతం! | mini mahabhratham! | Sakshi
Sakshi News home page

మినీ భారతం!

Aug 2 2015 12:06 AM | Updated on Sep 3 2017 6:35 AM

మినీ భారతం!

మినీ భారతం!

మహాభారతంలోని శ్రీకృష్ణుడు, పంచపాండవులు మళ్లీ తెరపై ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది?

మహాభారతంలోని  శ్రీకృష్ణుడు, పంచపాండవులు మళ్లీ తెరపై ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది? అది తెలియాలంటే  ‘సినీ మహల్’ చూడాల్సిందే.  సిద్దాంశ్, రాహుల్, తేజస్విని ముఖ్యతారలుగా లక్ష్మణ్ వర్మ దర్శక త్వంలో బి.రమేశ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను దర్శకుడు మారుతి హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.
 
 ఈ సందర్భంగా లక్ష్మణ్ వర్మ మాట్లాడుతూ- ‘‘ఈ చిత్రం మినీ మోడ్రన్ మహాభారతాన్ని పోలినట్లుగా ఉంటుంది. వినూత్న కథాంశంతో సాగే చిత్రం. కచ్చితంగా అందరికీ నచ్చే సినిమా అవుతుంది’’అని చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్ర సహ నిర్మాతలు పార్ధు, బాలాజీ , మురళీధర్, దర్శకుడు ప్రవీణ్ సత్తార్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement