సీఎం జగన్‌పై నారాయణమూర్తి ప్రశంసలు

Narayana Murthy Appreciation On YS Jagan Govt - Sakshi

సాక్షి, గుంటూరు :  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రముఖ సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వ పాలన అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. స్వాతంత్ర్యం వచ్చాక ఎవ్వరూ చేయని అభివృద్ధి, సంక్షేమ పథకాలు సీఎం జగన్ అమలు చేస్తున్నారని కొనియాడారు. సామాజిక న్యాయం కోసం జగన్ చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. జనాభాలో 54శాతం ఉన్న బీసీలకు చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని జగన్ ప్రయత్నిస్తున్నారని, అది అభినందనీయమని నారాయణమూర్తి స్పష్టం చేశారు. రిజర్వేషన్ల కొరకు పార్లమెంట్‌లో బిల్లు పెట్టినందుకు సీఎం వైఎస్‌ జగన్‌కు నారాయణమూర్తి హృదయ పూర్వక అభినందనలు  తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top