ఇద్దరు కానిస్టేబుళ్ల అనుమానాస్పద మృతి | mysterious death of two constables | Sakshi
Sakshi News home page

ఇద్దరు కానిస్టేబుళ్ల అనుమానాస్పద మృతి

May 13 2015 1:22 AM | Updated on Aug 21 2018 9:06 PM

ఇద్దరు పోలీసులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన సోమవారం కర్నూలు నగరంలో చోటుచేసుకుంది.

కర్నూలు: ఇద్దరు పోలీసులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన సోమవారం కర్నూలు నగరంలో చోటుచేసుకుంది. స్థానిక కొత్తపేట ఏఆర్ పోలీసు క్వార్టర్స్ పిండి జిన్ను లైన్‌లోని ఓ గది పైఅంతస్తులో ఈ ఘటన జరిగింది. మృతులను ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాదరెడ్డి గన్‌మెన్ మురళీకృష్ణ, క్రిష్ణగిరి పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న సివిల్ కానిస్టేబుల్ వీరేశ్‌గా గుర్తించారు.

మృతదేహాల పక్కన తుపాకీ ఉండటం తో ఒకరినొకరు కాల్చుకుని ఉండొచ్చని, ఒకరిని కాల్చి.. మరొకరు ఆత్మ హత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ రాధాకృష్ణ, కర్నూలు డీఎస్పీ రమణమూర్తి స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ బాబుప్రసాద్‌తో పాటు పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరిస్తున్నారు. ప్రేమ వ్యవహారంలో ఇద్దరి మధ్య గొడవ జరిగి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement