నా జీతం అంతా ప్రజా సంక్షేమానికే! | My salary to public welfare!:Kotamreddy Sridhar Reddy | Sakshi
Sakshi News home page

నా జీతం అంతా ప్రజాసంక్షేమానికే!

Aug 13 2014 3:30 PM | Updated on Sep 2 2017 11:50 AM

కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి

కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి

తన జీతం అంతా ప్రజాసంక్షేమానికే ఉపయోగిస్తానని నెల్లూరు రూరల్‌ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి చెప్పారు.

నెల్లూరు: తన జీతం అంతా ప్రజాసంక్షేమానికే ఉపయోగిస్తానని నెల్లూరు రూరల్‌ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి చెప్పారు. జీతం నుంచి తాను ఒక్క రూపాయి కూడా తీసుకోనన్నారు. ఐదేళ్లలో తనకు ప్రభుత్వం ద్వారా వచ్చే 60 లక్షల రూపాయల జీతం మొత్తం  ప్రజలకే ఉపయోగిస్తానని చెప్పారు.

పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తానన్నారు.  తాగునీటి పునరుద్దరణకు ఖర్చు చేస్తానని తెలిపారు. అలాగే ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు ఆర్థిక సాయం అందిస్తానని శ్రీధర్ రెడ్డి చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement