జగన్‌పై హత్యాయత్నం కేసు.. విజయవాడకు బదిలీ

Murder Attempt On YS Jagan Mohan Reddy is Transferred to Vizag Court - Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మీద హత్యాయత్నం కేసును విశాఖపట్నం నుంచి విజయవాడకు బదిలీ చేయాలంటూ మెట్రోపాలిటన్‌ కోర్టు తీర్పునిచ్చింది. జగన్‌పై హత్యాయత్నం కేసులో ప్రభుత్వం తమకు సహకరించడం లేదని.. ఈ కేసును విజయవాడకు బదిలీ చేయాలంటూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి.. ఈ కేసును విశాఖపట్నం నుంచి విజయవాడకు బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాక కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను ఎన్‌ఐఏకు అప్పగించాలంటూ కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top