జేసీ మురళి.. జిల్లాలోనే! | Murali district of JC ..! | Sakshi
Sakshi News home page

జేసీ మురళి.. జిల్లాలోనే!

Jan 19 2015 4:46 AM | Updated on Aug 1 2018 5:04 PM

జేసీ మురళి.. జిల్లాలోనే! - Sakshi

జేసీ మురళి.. జిల్లాలోనే!

జాయింట్ కలెక్టర్ జె.మురళిని జిల్లాలోనే కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా ఆయన రాజమండ్రి మున్సిపల్ కమిషనర్‌గా...

విజయవాడ : జాయింట్ కలెక్టర్ జె.మురళిని జిల్లాలోనే కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా ఆయన రాజమండ్రి మున్సిపల్ కమిషనర్‌గా, గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారిగా నియమితులయ్యారు. ఆయన స్థానంలో వైజాగ్ ఈపీఎస్‌పీడీసీఎల్ సీఎండీగా పనిచేస్తున్న శేషగిరిబాబు నియమితులయ్యారు.

జిల్లాలో కలెక్టర్, విజయవాడ మున్సిపల్ కమిషనర్, ఇతర ముఖ్య అధికారులు ఇటీవలే కొత్తగా బాధ్యతలు చేపట్టారు. జిల్లాలో అధికారులందరూ కొత్తవారు కావడంతో జాయింట్ కలెక్టర్ మురళిని ఇక్కడే కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. శేషగిరిబాబు కూడా ఇక్కడకు రావడానికి విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం పనిచేస్తున్న జాయింట్ కలెక్టర్ జె.మురళి ఇక్కడే కొనసాగుతారని తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement